Asianet News TeluguAsianet News Telugu

100 శాతం ఆంధ్రప్రదేశ్ కి ఫిల్మ్ ఇండస్ట్రీ రాదు ... ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!

నిర్మాత సి.కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లే అవకాశమే లేదంటూ కుండబద్దలుకొట్టినట్టు చెప్పేశారు.

producer c kalyan sensational comments Tollywood and ap government
Author
First Published Jan 18, 2023, 8:53 PM IST

ఆంధ్రాలో  ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్మాత సి. కళ్యాణ్.  ఈయన మాట్లాడుతూ.. నేను గతంలో చెబితేనే చాలామంది నన్ను ట్రోల్ చేశారు.. ఆంధ్రాకి సినిమా ఫీల్డ్ రాదని చెప్పావేంటి  అన్నారు. కాని అదే నిజం. నేను చెప్పింది 100% నిజం అంటూ సంచలనం రేపారు కళ్యాన్. ఇక్కడ ఉన్నవాళ్లు అక్కిడికి వెళ్తారా.. ఇక్కడ అలవాటుపడి అక్కడకు వెళ్లగలరా..? మద్రాస్ నుండి ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడ్డాం అంటూ వివరించారు. అంతే కాదు అక్కడ ప్రభుత్వం వల్ల వచ్చే సమస్యల గురించి మాట్లాడుతూ..  గవర్నమెంట్ తెచ్చిన కొత్త జివో ప్రకారం  ఓ సినిమా తీశా.. RDX లవ్ అని.. ఫుల్ సినిమా ఆంధ్రాలోనే తీస్తే 3 కోట్లు ఎక్సట్రా అయ్యింది. ఆంధ్రా నుండి నిర్మాతలకు ఏం బెనిఫిట్స్ లేవు. పాత రోజుల్లో సబ్సిడీ ఉండేది. ఇప్పుడా సబ్సిడీలు లేవు. మాకు పాత గవర్నమెంట్స్ ఇవ్వాల్సిన సబ్సిడీలే ఇంకా రాలేదు. సినిమా ఫీల్డ్ ని పాలిటిక్స్ లో థింక్ చేయకండి అంటూ క్లారిటీ ఇచ్చారు కళ్యాణ్. 

అంతే కాదు వీలైనంత త్వరగా ఆంధ్రాలో నంది అవార్డ్స్ .. తెలంగాణలో సింహ అవార్డులను  ఇచ్చేలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆయనరిక్వెస్ట్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.తెలుగు నిర్మాతల మండలిలో ఫిబ్రవరి 19న ఎన్నికలు జరగనున్నట్లు కళ్యాణ్  ప్రకటించారు. నిర్మాతల మండలికి గొప్ప చరిత్ర ఉంది. అదెప్పుడూ బాగుండాలని కోరుకుంటాము. టీఎఫ్పీసీ కమిటీపై కావాలనే కొందరు సోషల్ మీడియాలో బురద చల్లుతున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకున్నాము అన్నారు. ఈక్రమంలోనే నిర్మాతలు కె. సురేష్ బాబుని మూడేళ్లు, యలమంచిలి రవిచంద్ ను జీవితకాలం మండలి నుండి బహిష్కరించాం అని చెప్పారు కళ్యాణ్. 

 

నిర్మాతల మండలికి చెడ్డ పేరు తేవాలని ఎవరు ప్రయత్నించినా వదిలేది లేదని  ఆయన హెచ్చరించారు. కొంతమంది మండలిలో ఎన్నికలు జరగట్లేదని రాద్దాంతం చేస్తున్నారు. వచ్చే నెల 19న నిర్మాతల మండలికి ఎన్నికలు జరుగుతాయి.  ఫిబ్రవరి ఫస్ట్‌ నుంచి 6 వ తేదీ వరకు నామినేషన్స్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకరు ఒక పోస్ట్‌ కి మాత్రమే పోటీ చెయ్యాలి.13వ తేదీ వరకు విత్‌ డ్రా చేసుకోవచ్చు.కే దుర్గ ప్రసాద్‌ ఎన్నిక అధికారిగా కొనసాగబోతున్నారు.అదే రోజు సాయంత్రం ఈసీ మీటింగ్‌ జరుగుతుంది అని తెలిపారు. అలాగే జనరల్ బాడీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు సి కళ్యాణ్ తెలిపారు. 

ఇక కౌన్సిల్‌ ఫండ్‌ గురించి వివరిస్తూ,   మా కౌన్సిల్‌ లో ప్రస్తుతం 9 కోట్ల ఫండ్‌ ఉంది.  ఇంత అమౌంట్‌ పోగవ్వడానికి కారణం  దాసరి నారాయణ రావు గారే.  మాకు తిరుపతిలో ఒక బిల్డింగ్‌ ఉంది.  మూవీ టవర్స్‌ లో రెండు కోట్ల 40 లక్షలు పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు అది 10 కోట్లకు చేరింది. డిసెంబర్‌ 31వ తేదీ వరకు అకౌంట్స్‌ అన్ని ఈసీ లో పాస్‌ అయినవే అని అన్నారు.అలాగే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా ఉన్న సౌత్ ఇండియా ఫిలింఛాంబర్ ...దానికి అనుబంధగా తెలుగు చలన చిత్ర మండలి, ప్రొడ్యూసర్ కౌన్సెల్ ఉన్నాయి...అంతే తప్ప  ఆంధ్ర ఫిలిం ఛాంబర్, ఆంధ్ర ఫిల్మ్ ఫెడరేషన్ వంటి సంస్థల కు మాకు సంబంధం లేదు.   పదవులు కోసం కొన్ని సంస్థలు పెడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios