బండ్ల గణేష్‌ మరోసారి తన సేవా హృదయాన్ని చాటుకున్నారు. ఓ నెటిజన్‌ అభ్యర్థన గమనించిన ఆయన స్వచ్ఛందంగా సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. 

కరోనా విలయం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఇండియాని కూడా సెకండ్‌ వేవ్‌ వణికించింది. లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. అదే సమయంలో మంచి మనుసున్న వారిని కూడా వెలికి తీసింది. సోనూ సూద్‌, చిరంజీవి, సుకుమార్‌, ప్రకాష్‌ రాజ్‌ ఇలా చాలా మంది తారలు తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు. వారిలో బండ్ల గణేష్‌ కూడా ఉన్నారు. అయితే తాజాగా బండ్ల గణేష్‌ మరోసారి తన సేవా హృదయాన్ని చాటుకున్నారు. ఓ నెటిజన్‌ అభ్యర్థన గమనించిన ఆయన స్వచ్ఛందంగా సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. 

ఓ నెటిజన్ తన అమ్మకు బ్రెస్ట్ కాన్సర్ అని, వైద్యానికి ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేస్తూ, అందు కోసం అందరి సాయాన్ని అర్థించాడు. ట్విట్టర్‌ ద్వారా సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇప్పటి వరకు ఐదు లక్షలకు పైగా విరాళం అందింది. మెడికోవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో వైద్యం అందిస్తున్నామని, వీలైన సాయం చేయాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తే.. నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ స్పందించారు. `మీ గూగుల్ పే నంబర్ ఇవ్వండి. మనం ఆ దేవుడు ఆశీస్సులతో మీ అమ్మ గారిని కాపాడేందుకు ప్రయత్నిద్దామ`ని తెలిపారు బండ్ల గణేష్‌. దీంతో బండ్లన్న చేస్తున్న సాయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Scroll to load tweet…