కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న అనిరుధ్ తెలుగులో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు. ఒకట్రెండు పెద్ద ప్రాజెక్ట్ లు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. 'అజ్ఞాతవాసి', 'జెర్సీ' సినిమాల తరువాత ప్రస్తుతం నాని నటిస్తోన్న 'గ్యాంగ్ లీడర్' సినిమాకి వర్క్ చేస్తున్నాడు అనిరుధ్.

అయితే అనిరుధ్ తో సమస్యేంటంటే.. చెప్పిన టైంకి ట్యూన్ లు ఇవ్వడట. అందుకే పెద్ద సినిమాల దర్శకనిర్మాతలు అతడితో కలిసి పని చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. 'గ్యాంగ్ లీడర్' సినిమాకి కూడా ఒక్క ట్యూన్ ఇచ్చి ఊరుకున్నాడట.

నిజానికి ఈ సినిమాలో కేవలం మూడు పాటలు మాత్రమే ఉంటాయి. ఇప్పటివరకు అనిరుధ్ ఒక్క ట్యూన్ మాత్రమే ఇవ్వడంతో ఇప్పుడు డైరెక్టర్ విక్రమ్  కుమార్ కి టెన్షన్ మొదలైందట. ట్యూన్ ఇస్తే దానికి తగ్గట్లు పాట రాయించుకొని, షూటింగ్ కూడా మొదలుపెట్టాలి. కానీ ఇప్పటివరకు ట్యూన్స్ ఇవ్వకపోవడం, రిలీజ్ డేట్ ముందుగానే అనౌన్స్ చేయడంతో విక్రమ్ కుమార్ టెన్షన్ పడుతున్నాడట.

అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తవుతుందా..? లేదా..? అని అనుకుంటుంటే.. ఇప్పుడు పాటల పని కూడా ఆలస్యమయ్యేలా ఉండడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందట.  మరి అనిరుధ్ ఇప్పటికైనా ట్యూన్స్ ఇచ్చి డైరెక్టర్ టెన్షన్ తగ్గిస్తాడేమో చూడాలి!