బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గతేడాది డిసెంబర్ లో నిక్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి జరిగి నాలుగునెలలు కూడా కాలేదు కానీ అప్పుడే వారి వివాహ బంధంపై ఇంటర్నేషనల్ మీడియాలో షాకింగ్ కథనాలు వస్తున్నాయి.

ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయని, వారి వైవాహిక బంధం విడాకుల దిశగా పయనిస్తోందని బ్రిటన్ కి చెందిన 'ok!' మ్యాగజైన్ రీసెంట్ గా సంచలన కథనం ప్రచురించింది. ప్రియాంక, నిక్ ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారని.. ఎవరు రాజీ పడడం లేదని కథనంలో రాసుకొచ్చారు.

ఇప్పుడు ఇద్దరి విడిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయని రాసుకొచ్చారు. కొన్ని విషయాల్లో ప్రియాంక టెంపర్ చూపిస్తుందని, ఆ విషయం నచ్చని నిక్ ఆమెతో గొడవ పడుతున్నాడని రకరకాలుగా రాశారు.

పైకి మాత్రం తమ మధ్య గొడవలు లేవన్నట్లుగా కవర్ చేస్తూ నటిస్తున్నారని, ఎక్కువ రోజు వారి బంధం నిలిచేలా లేదని అంటున్నారు. నిక్ కుటుంబ సభ్యులు కూడా ప్రియాంక ప్రవర్తనతో విసిగిపోయారని రాశారు. ఇప్పుడు ఈ వార్తలు విన్న ప్రియాంక, నిక్ అభిమానులు అప్సెట్ అవుతున్నారు. ఈ వార్తలు నిజం కాకూడదని కోరుకుంటున్నారు.  

నాని vs విజయ్ దేవరకొండ: బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్