టాక్సీ వాలా సినిమాతో ఒక్కసారిగా అందరిని ఆకర్షించిన ఎన్నారై బ్యూటీ ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమానే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో నెక్స్ట్ కూడా అదే రేంజ్ లో హిట్టందుకోవాలని ఎదురుచూస్తోంది. అందుకోసమే కథలను  ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.  

అయితే ఎవరు ఊహించని విధంగా బేబీ ఒక డిజాస్టర్ కాంబినేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా హిట్టుకోసం ఆరాటపడుతున్న బొమ్మరిల్లు భాస్కర్ ఒక్కఛాన్స్ అంటూ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో గీత ఆర్ట్స్ పిలిచి ఒక అఫర్ ఇచ్చింది. అయితే అక్కినేని అఖిల్ తో ఒక కథను రెడీ చేసుకున్న భాస్కర్ తన సినిమాతో అఖిల్ కి మొదటి హిట్ ఇస్తాను అని కాన్ఫిడెన్స్ గా ఉన్నాడట. 

అఖిల్ కి ఒక హిట్టు కథ దొరికేతే చాలని అక్కినేని ఫ్యామిలి తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ తరుణంలో గీత ఆర్ట్స్ నుంచి మద్దతు వచ్చింది. సక్సెస్ లేని దర్శకుడిని హీరోను కలిపి మంచి సినిమాను నిర్మించాలని మెగా సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇక సినిమాలో అఖిల్ కు జోడిగా నటించడానికి ప్రియాంక జువాల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి హిట్టు కోసం పరితపిస్తున్న ఈ కాంబోలో సక్సెస్ హీరోయిన్ ఏ రేంజ్ కి వెళుతుందో చూడాలి.