బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నటించిన సినిమా 'ది స్కై ఈజ్ పింక్' విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఇటీవల డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంకా షోకి జడ్జిగా వ్యవహరిస్తోన్న కరీనాకపూర్ తో ఫోటోలు దిగారు.

వాటిని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలతో పాటు కరీనా, ప్రియాంకా ముద్దు పెట్టుకుంటున్నట్లు ఉన్న ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పెళ్లి తరువాత ప్రియాంకా బాలీవుడ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. దాదాపు మూడేళ్ల తరువాత ఆమె నటిస్తోన్న సినిమా ఇది. ఇందులో ఫర్హాన్ అక్తర్, జైరా వాసిం లాంటి నటులు కీలకపాత్రలు పోషించారు.

సోనాలీ బోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కి సిద్ధమవుతోంది. చిన్నతనంలోనే అరుదైన వ్యాధికి గురైన అయిషా చౌదరి పదిహేనేళ్లకే వక్తగా, రచయిత్రిగా  గుర్తింపు తెచ్చుకుంది. ఆమె జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.