స్టార్ హీరోయిన్ ప్రేమాయణంపై తల్లి రియాక్షన్!

Priyanka Chopra's mom about her daughter's love affair
Highlights

బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు వెళ్లిన ప్రియాంక చోప్రా ఇటీవల నిక్ జోనస్ అనే పాప్ సింగర్ కమ్ 

బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు వెళ్లిన ప్రియాంక చోప్రా ఇటీవల నిక్ జోనస్ అనే పాప్ సింగర్ కమ్ యాక్టర్ తో ప్రేమాయణం నడిపిస్తుందని వార్తలు వినిపించాయి. తనకంటే వయసులో పదేళ్లు చిన్నవాడైన నిక్ ను ఆమె ప్రేమించడం పట్ల నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అటు నిక్ గానీ ఇటు ప్రియాంక గానీ స్పందించలేదు. కానీ ప్రియాంక చోప్రా తల్లి ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించింది.

''ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు కానీ విదేశీ వ్యక్తిని మాత్రం నేను అల్లుడిగా చేసుకోవడానికి సిద్ధంగా లేను. ఇద్దరూ కూడా ఒకే కులానికి చెందినా వారైతేనే వారి దాంపత్య జీవితం బాగుంటుంది. ప్రియాంక విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నేను భరించలేను. ఒకవేళ ఆమెకు సరైన జోడీ దొరక్క పెళ్లి చేసుకోకుండా ఉండిపోయినా ఎలాంటి అభ్యంతరం లేదు'' అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ప్రియాంక రెండు హాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది. అలానే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించడానికి రెడీ అవుతోంది. 

loader