గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా తన ప్రియుడు అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం రాజస్తాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న ఉమైద్ భవన్ ప్యాలస్ లో వీరి వివాహం జరిగింది.

వీరి పెళ్లి వేడుకకు కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రిలయన్స్ దిగ్గజం అంబానీ కుటుంబం కూడా హాజరైంది. అయితే వివాహం చేసుకొని రెండు ఒక్క రోజు కాకుండానే ఈ జంట వివాదంలో చిక్కుకుంది. వివాహం జరిగిన సంధర్భంగా ప్యాలెస్ వద్ద బాణాసంచా కాల్చడంపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది.

దీపావళి రోజునే బాణాసంచా కాల్చడంపై సుప్రీం కోర్టు షరతులు విధిస్తుంటే ప్రియాంక, నిక్ లు మాత్రం తమకు నచ్చినట్లు బాణాసంచా కాలుస్తారా అంటూ మండిపడుతున్నారు. ప్రియాంక ఆస్తమా వ్యాధిపై అవగాహన కలిగించే కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తూ బాణాసంచా కాల్చోద్దంటూ చెప్పే ఆమె ఇప్పుడు ఎలా వాటిని ఎంకరేజ్ చేస్తుందని నిలదీస్తున్నారు. మరి సోషల్ మీడియాలో వస్తోన్న ఈ విమర్శలపై ప్రియాంక స్పందిస్తుందేమో చూడాలి!