గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సమాజంలో మార్పు కోసం తనవంతు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. కానీ రాజకీయాలకు సంబంధించి మాత్రం పెద్దగా మాట్లాడరు. పాలిటిక్స్ కి వీలైనంత దూరంగా ఉంటుంది. 

కానీ తొలిసారి తనకు ఛాన్స్ ఉంటే భారత ప్రధానిని అవుతానని అంటోంది. ఓ అమెరికన్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక ఈ విషయాన్ని ప్రస్తావించింది. అవకాశం వస్తే నేను భారత ప్రధానిని అవుతా.. నా భర్త నిక్ అమెరికా అధ్యక్షుడి పదవికి పోటీ చేస్తారంటూ సంచలన కామెంట్స్ చేసింది.

తనకు రాజకీయాలతో ముడిపడిన అంశాలంటే నచ్చవని, కానీ దేశంలో మార్పు రావాలని తను, తన భర్త కోరుకుంటున్నామని చెప్పుకొచ్చింది. అయితే ఆమె సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారా..? లేక నిజంగానే రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉందా..? అనే విషయంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతోంది. ఆమె నటించిన 'ది స్కై ఈజ్ పింక్' అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.