RRR స్పెషల్ స్క్రీనింగ్ లో మెరిసిన ప్రియాంక చోప్రా, జక్కన్నతో ఫోటోలకు ఫోజులిచ్చిన గ్లోబల్ బ్యూటీ
ఆర్ఆర్ఆర్ టీమ్ తో కలిసి సందడి చేసింది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. రాజమౌళితో పాటు ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చింది.

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అదరగోడుతొంది. ఆస్కార్ బరిలో దూసుకుపోతోంది. రిలీజ్ అయ్యి ఏడాది కావస్తున్నా.. అదే క్రేజ్ తో ప్రపంచమంతా మారుమోగుతోంది సినిమా. బాషతో సంబంధంలేకుండా.. యూనివర్సల్ క్రేజ్ సాధించింది మూవీ. ప్రస్తుతం హాలీవుడ్ అవార్డ్స్ లో సత్తా చాటుతూ.. ఇండియన్ సినిమా పేరు నిలబెడుతుంది. ఇండియాలో టాలీవుడ్ సినిమా తలెత్తుకునేలా చేసింది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్ లు సాధించిన ఈమూవీ ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది.
ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్ అమరికాలోనే ఉంటూ.. ట్రీపుల్ ఆర్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా లాస్‌ఏంజెల్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్ స్పెషల్ షో ప్రదర్శించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో గ్లోబల్ స్టార్, బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా పాల్గోని సందడి చేసింది. రాజమౌళి, ఎంఎం కీరవాణిని కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా పేజ్ లో పంచుకుంది. ఆర్ఆర్ఆర్ గురించి ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ.. ఈ విధంగా రాసింది ప్రియాంక.. ఈ అత్యద్భుతమైన భారతీయ చలనచిత్ర ప్రయాణానికి నా వంతుగా సహకరించగలను అని రాసుకొచ్చింది.
రీసెంట్ గా ఆస్కార్ తరువాత అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ అయిన గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ను సాధించింది ఆర్ఆర్ఆర్. ఈమూవీలోని నాటు నాటు ఒరిజినల్ సాంగ్ కు ఈ అవార్డ్ వచ్చింది. దాంతో దేశం మొత్తం ట్రిపుల్ ఆర్ టీమ్ ను అభినందించింది. ప్రధానితో సహా ప్రముఖులంతా వారిని అభినందించారు. ఇక ఆస్కార్స్ 2023 రేసులో లో మొత్తం 14 కేటగిరీలకు ఆర్‌ఆర్‌ఆర్ దరఖాస్తు చేసుకుంది. అయితే జనవరి 24వ తేదీన ఆస్కార్స్ తుది నామినేషన్ల జాబితాను రిలీజ్ చేస్తారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు సాంగ్ కు ఆస్కార్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే.. టాలీవుడ్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ ను స్థిరం చేసుకున్నట్టే.
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. భారీ కలెక్షన్లతో పాటు.. హాలీవుడ్ మేకర్స్ ను కూడా ఆకర్షించిన ఈ సినిమా.. తన విజయ ప్రభావాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. హాలీవుడ్ లో మరింత పాపులారిటీ సాధిస్తోంది మూవీ.. వరుస గౌరవాలు సాధిస్తుండటంతో.. వాటిని అందుకోవడం కోసం రాజమౌళి కొంత కాలంగా ఫారెన్ టూర్లలోనే ఉంటూ వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇంకా ఎక్కువగా ప్రమోషన్ చేస్తూ.. సందడి చేస్తున్నారు. ఎలాగైనా ఆస్కార్ కొట్టాలని పట్టుదలతో రాజమౌళి అమెరికాలోనే ఉండి RRR ని మరింత ప్రమోట్ చేస్తూ తెగ కష్టపడుతున్నాడు.