పాతికేళ్ల కుర్రాడితో హీరోయిన్ ప్రేమాయణం!

priyanka chopra and nick jonar are dating
Highlights

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తనకంటే చిన్నవాడైన ఒక వ్యక్తిని ప్రేమిస్తుందంటూ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తనకంటే చిన్నవాడైన ఒక వ్యక్తిని ప్రేమిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 'క్వాంటికో' సిరీస్ తో హాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ప్రియాంక.. పాప్ సింగర్ కం యాక్టర్ అయిన నిక్ జోనస్ అనే అబ్బాయితో కలిసి తెగ తిరుగుతుందని హాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ప్రియాంక వయసు 35 ఏళ్లు.. తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ తో ఆమె సన్నిహితంగా మెలగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడి ఏడాదికి పైనే అయింది. నాలుగైదు పబ్లిక్ ఈవెంట్స్ కు కలిసే వెళ్లారు. ప్రస్తుతం ప్రియాంక చేస్తోన్న క్వాంటికో సిరీస్ ను నిర్వాహకులు ఆపేయడంతో గత కొద్దిరోజులుగా ఆమె ఖాళీగానే ఉంటోంది. మరో పక్క నిక్ కూడా ఫ్రీగా ఉండడంతో ఇద్దరూ కొన్నాళ్ల పాటు కాలక్షేపానికి కలిసి తిరుగుతున్నారని మూడు వారాలుగా కలిసే ఉన్నారని అంటున్నారు.

ప్రస్తుతం ఇద్దరూ టూర్ లో ఉన్నారని అమెరికా అందమైన ప్రదేశాలన్నీ కూడా కలిసి చూస్తున్నారని హాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో ప్రియాంకను నిక్ తో అంత సన్నిహితంగా ఉంటున్నారేంటని ప్రశ్నించిన మీడియాకు సమాధానంగా.. అతనేమీ పదకొండేళ్ల చిన్న పిల్లాడు కాదు కదా అంటూ ఆన్సర్ చేసింది. ప్రస్తుతం ప్రియాంక చేతిలో సల్మాన్ ఖాన్ నటించనున్న 'భరత్' సినిమా ఒక్కటే ఉంది.  

loader