బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి పెద్ద ఉద్యమం జరిగింది. 'మీటూ' అంటూ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది నటీమణులు బయటకొచ్చారు.

కానీ ప్రియాంక చోప్రా అప్పుడు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ తాజాగా ఓ  ఇంటర్వ్యూలో తనని సెక్సువల్ వేధింపులకు గురి చేసినట్లు చెప్పుకొచ్చింది. మొదట యాంకర్.. 'ఎప్పుడైనా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారా..?' అని ప్రశ్నించగా.. వెంటనే తన చెయ్యి పైకెత్తి.. ''ఎస్.. నేను కూడా బాధితురాలినే'' అని చెప్పింది.

అయితే అంతకుమించి పూర్తి వివరాలను చెప్పలేదు. తనను ఎవరు వేధించారు..? ఎప్పుడు వేధించారనే విషయాలపై మాట్లాడడానికి ప్రియాంక ఇష్టపడలేదు. ప్రస్తుతం ప్రియాంక తన భర్త నిక్ తో కలిసి అమెరికాలో జీవిస్తోంది.

బాలీవుడ్ చిత్రాలకంటే హాలీవుడ్ లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతోంది ప్రియాంక.