విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక జువాల్కర్ ఇప్పుడు అందరిని తెగ ఆకర్షిస్తోంది. నటన కోసం అమ్మడు ఒక సీన్ లో ఏకంగా వోడ్కా తాగేసినట్లు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు ఆ రోజు షూటింగ్ మొత్తం అమ్మడు నవ్వుతూనే ఉందట. 

ఇక రీసెంట్ గా మరొక విషయాన్నీ ప్రియాంక తెలిపింది. ఆ రోజు సీన్ లో కొంచెమే తాగినప్పటికీ ఏం చేస్తున్నానో అర్ధం కాలేదు. నవ్వుతూనే ఉన్నా. అయితే తనను హ్యాండిల్ చేయడానికి మేకప్ మ్యాన్ కి చుక్కలు కనిపించాయని అమ్మడు వివరించింది. తన మేకప్ చెడిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి ఆయన పడ్డ తిప్పలు అన్ని ఇన్ని కావని చెప్పింది. 

ఇక ట్యాక్సీ వాలా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుపుతూ ముఖ్యంగా కామెడీ సన్నివేశాల్లో విజయ్ నటన హైలెట్ గా నిలుస్తుందని ప్రియాంక వివరణ ఇచ్చింది. రాహుల్ ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ - గీత ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించింది. ఇక ఈ నెల 17న సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.