Asianet News TeluguAsianet News Telugu

ప్రియమణి నుంచి పాన్ ఇండియా ఫిల్మ్.. ‘కొటేషన్ గ్యాంగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.! ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

సీనియర్ నటి ప్రియమణి నుంచి వస్తున్న మరో చిత్రం ‘కొటేషన్ గ్యాంగ్’. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్ర రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా రిలీజ్ డేట్ పై క్రేజీ అప్డేట్ అందింది. 
 

Priyamanis Quotation Gang movie Release  Date? NSK
Author
First Published Nov 12, 2023, 8:21 PM IST

సీనియర్ నటి ప్రియమణి (Priyamani)  చివరిగా ‘జవాన్’తో వెండితెరపై మెరిసింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పక్కనే ఉండే ముఖ్యమైన పాత్రలో అలరించింది. యాక్షన్ సీన్లలో ప్రియమణి అదరగొట్టింది. భారీ ప్రాజెక్ట్స్ లో కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ అదరగొడుతోంది. చివరిగా ‘భామాకలాపం’తో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో రాబోతోంది. 

ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్, గాయత్రి రెడ్డి లు ప్రధాన పాత్రలో నటించిన చిత్రమే Quotation Gang. చిత్రానికి వివేక్ కుమార్ కర్నూల్ దర్శకత్వం వహించారు. ఫిల్మిటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ రూపుదిద్దుకుంటున్న ఈచిత్రాన్ని నిర్మాతలు గాయత్రి సురేష్, వివేకానందం తెరకెక్కిస్తున్నారు. డ్రమ్ శివమణి సంగీతం అందిస్తుండటం విశేషం. అయితే  ఈ చిత్రం కోసం ప్రియమణి అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

తాజాగా ‘కొటేషన్ గ్యాంగ్’ రిలీజ్ పై అప్డేట్ అందింది. డిసెంబర్ రెండో వారంలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసురాబోతున్నారని మేకర్స్ ప్రకటించారు. పక్కా డేట్ ను కూడా ప్రకటిస్తామని తెలిపారు. అదికూడా పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించారు. 

కేరళలోని ఇప్పటికీ ఉన్న కొటేషన్ గ్యాంగ్ కారణంగానే ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. ప్రియమణి పాత్ర ఈ చిత్రంలో మరింత స్ట్రాంగ్ గా ఉంటుందని ఆసక్తి పెంచారు. ఫైట్స్ అద్బుతంగా వచ్చాయని తెలిపారు. చెన్నై, ముంబై, కశ్మీర్ లో జరిగే మూడు కథలు ముంబైలో కలుస్తాయని, డబ్బుకోసం వారు ఏదైనా చేసే ముఠాగా మారుతారు. ఈ నేపథ్యంలోనే సినిమా సాగుతుందన్నారు. ఇక ప్రియమణి చేతిలో ‘నెరు’; ‘ఖైమర’, ‘మైదాన్’ వంటి చిత్రాలు ఉన్నాయి. 

Priyamanis Quotation Gang movie Release  Date? NSK

Follow Us:
Download App:
  • android
  • ios