Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్-ప్రియమణిపై అలాంటి రూమర్... ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్!

దేవర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ పై ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది. ఈ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. 
 

priyamani unexpected role in ntr devara movie ksr
Author
First Published Sep 27, 2023, 8:31 AM IST

దర్శకుడు కొరటాల శివ దేవర షూటింగ్ పరుగులు పెట్టిస్తున్నారు. 2024 ఏప్రిల్ 5 విడుదల తేదీగా ప్రకటించారు. డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి మూడు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయాలనేది ప్లాన్. ఈ చిత్రానికి భారీగా విజువల్ ఎఫెక్ట్స్ వాడుతున్నారట. ఈ క్రమంలో పోస్ట్ ప్రొడక్షన్ కి సమయం తీసుకునే అవకాశం కలదట. అందుకే షూటింగ్ పార్ట్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనేది కొరటాల ఆలోచన. 

హైదరాబాద్ లో బీచ్ సెట్ వేయగా ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఓ క్రేజీ రూమర్ ఈ చిత్రం గురించి చక్కర్లు కొడుతుంది. దేవర చిత్రంలో ఎన్టీఆర్ తల్లి పాత్ర కోసం ప్రియమణిని తీసుకున్నారట. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తుండగా ఓ పాత్రకు జంటగా ప్రియమణి కనిపిస్తుందట. ఆ లెక్కన ప్రియమణి యంగ్ ఎన్టీఆర్ కి తల్లిగా ఉంటారు. 

అయితే తల్లి పాత్ర కోసం ప్రియమణిని తీసుకోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారట. ఆమె కాకుండా మరొక హీరోయిన్ ని తీసుకుంటే బాగుండేదనే అభిప్రాయం వెల్లడిస్తున్నారట. గతంలో ప్రియమణి-ఎన్టీఆర్ కాంబోలో యమదొంగ విడుదలైంది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకుంది. మరి ప్రచారం అవుతున్న రూమర్స్ లో నిజం ఉంటే... గ్యాప్ తర్వాత కలిసి నటిస్తున్నట్లు అవుతుంది. 

ఇక దేవర మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ చేస్తున్నారు. ఆమెకు ఇది ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న దేవర చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి.. 

Follow Us:
Download App:
  • android
  • ios