టాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటైన RRR షూటింగ్ మొదలైనప్పటి నుంచే అనేక రూమర్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సినిమాకు సంబదించిన మరొక రూమర్స్ ట్రేండింగ్ గా మారింది. సినిమాలో కథానాయకులు తారక్ - చరణ్ తప్పితే ఇతర నటీనటులు ఎవరనే విషయాన్నీ చిత్ర యూనిట్ ఇంతవరకు బయటపెట్టలేదు. 

అయితే ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో సినిమాకు సంబందించిన ఒక కొత్త రూమర్ హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో ఒక ముఖ్య పాత్రలో ప్రియమణి నటించే అవకాశం ఉందని టాక్ వస్తోంది. గతంలో ఎన్టీఆర్ - రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ సినిమాలో అమ్మడు హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఒక సీరియస్ పాత్రలో ప్రియమణి నటించే అవకాశం ఉందని సమాచారం. 

రీసెంట్ గా రాజమౌళి చర్చలు జరిపి క్యారెక్టర్ గురించి వివరించినట్లు తెలుస్తోంది. అయితే జక్కన్న టీమ్ మాత్రం ఎన్ని రూమర్స్ వస్తున్నా కూడా స్పందించడం లేదు. రీసెంట్ గా షూటింగ్ ను స్టార్ట్ చేసిన దర్శకుడు భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. డివివి.దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.