పెళ్ళైన కొత్తలో అంటూ మొదటి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ప్రియమణి బాగా దగ్గరైపోయింది. ఆ తరువాత యమదొంగ సినిమాతో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది అనుకుంటే బేబీ మెల్లమెల్లగా మాయమైపోయింది. ఇక డీ షో ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకుల దగ్గరకు వచ్చిన ఈ బ్యూటీ మా ఎన్నికల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. 

హీరోయిన్ గా అవకాశాలు లేకపోయినా వచ్చినా ఆఫర్స్ చేస్తూ తెలుగు ఇండస్ట్రీపై ఉన్న ప్రేమను ఓటు హక్కు ద్వారా చూపించేసింది. అయితే మిగతా హీరోయిన్స్ ఎవరు ఎక్కువగా కనిపించకపోవడంతో ఇప్పుడు వారిపై సినీ వర్గాలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురు కుర్ర హీరోలు స్టార్ హీరోలు కూడా ఎలక్షన్స్ లో పాల్గొనలేదు. 

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సోషల్ మీడియాలో మెస్సేజ్ లు ఇచ్చే స్టార్ లు సొంత ఇండస్ట్రీలో ఒట్టు హక్కును వినియోగించుకోకపోవడం జనాలను ఆశ్చర్యనికి గురి చేస్తోంది.