థాంక్యూ మూవీ పరాజయం తర్వాత ఒక ఆసక్తికర చిత్రాన్ని నాగ చైతన్య ప్రారంభించారు. తమిళ క్రేజీ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు ప్రస్తుతం నటిస్తున్నాడు. 

థాంక్యూ మూవీ పరాజయం తర్వాత ఒక ఆసక్తికర చిత్రాన్ని నాగ చైతన్య ప్రారంభించారు. తమిళ క్రేజీ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు ప్రస్తుతం నటిస్తున్నాడు. హీరో శింబుతో మానాడు చిత్రాన్ని తెరకెక్కించిన వెంకట్ ప్రభు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దీనితో చైతు మూవీపై భారీ అంచానాలు ఉన్నాయి. 

యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ కర్ణాటకలో జరుగుతుండగా వివాదం జరిగింది. మద్యం షాపు సెట్ వేయడంతో అక్కడి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో ఆ ప్రాంతంలో నాగ చైతన్య మూవీ షూటింగ్ ని అధికారులు రద్దు చేశారు. 

ఇది పక్కన పెడితే షూటింగ్ అంతా సవ్యంగా సాగుతోంది. తాజాగా చిత్ర యూనిట్ క్రేజీ అప్డేట్ ప్రకటించింది. నాగ చైతన్య మూవీలో అందాల భామ, జాతీయ అవార్డు గెలిచిన నటి ప్రియమణి కీలక పాత్రలో నటించనుంది. ఆమెకి వెల్కమ్ చెబుతూ చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చారు. 

మరొక ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో విల్లన్ గా అందాల నటుడు అరవింద్ స్వామి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ధృవ తర్వాత అరవింద్ స్వామి తెలుగులో మరో చిత్రం చేయలేదు. తాజాగా ఆయన నాగ చైతన్య మూవీకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. 

శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రానికి నిర్మాత. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. 

Scroll to load tweet…