అల్లు అర్జున్ తో ఛాన్స్ వస్తే తగ్గేదే లే.. కానీ, పుష్ప 2 రూమర్స్ పై ప్రియమణి క్లారిటీ
ప్రస్తుతం ప్రియమణి షారుఖ్ ఖాన్ జవాన్ చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప 2 చిత్రం గురించి ఓపెన్ అయింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ది రూల్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేసిన పుష్ప ది రూల్ టీజర్ ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసింది. సినిమాపై ప్రారంభంలోనే సాలిడ్ బజ్ క్రియేట్ చేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యారు. పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
పుష్ప 2 చిత్రాన్ని సుకుమార్ కనీవినీ ఎరుగని విధంగా భారీ బడ్జెట్ లో అంతకి మించిన కథతో తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. పుష్ప మొదటి భాగంలో బన్నీ చెప్పిన తగ్గేదే లే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా సుకుమార్ పుష్ప 2 ని తీర్చిదిద్దుతున్నారట.
రెండవ భాగంలో కొత్త నటీనటులు కొందరు జాయిన్ కాబోతున్నారు. కథకి తగ్గట్లుగా సుకుమార్ ఆ పాత్రలని డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. క్రేజీ నటి ప్రియమణి పుష్ప 2 లో కీలక పాత్రలో నటిస్తోంది అంటూ జోరుగా ప్రచారం సాగింది. ఆల్మోస్ట్ అఫీషియల్ అన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని ప్రకటించాయి. దీనితో ప్రియమణి ఎలాంటి పాత్రలో నటిస్తోంది అంటూ ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోయింది.
ప్రస్తుతం ప్రియమణి షారుఖ్ ఖాన్ జవాన్ చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప 2 చిత్రం గురించి ఓపెన్ అయింది. తన గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది.ప్రియమణి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ చిత్రంలో ఛాన్స్ వస్తే వదులుకోను. కానీ పుష్ప 2 కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు అని పేర్కొంది. తాను పుష్ప 2లో నటించడం లేదు అని క్లారిటీ ఇచ్చింది.
దీనితో పుష్ప 2లో ప్రియమణి నటిస్తోంది అంటూ వచ్చిన వార్తలన్నీ ఫేక్ అని తేలిపోయింది. షారుఖ్ జవాన్ చిత్రంలో ప్రియమణి కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రియమణి చివరగా తెలుగులో నాగచైతన్య కస్టడీలో నటించింది.