టాలెంటెడ్ హీరోయిన్ ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా సాగుతుంది. చేతినిండా సినిమాలతో బిజీ ఆర్టిస్ట్ గా మారారు ఆమె. హిందీతో పాటు తెలుగు, కన్నడ చిత్రాలు కలిపి అరడజనుకు పైగా ప్రియమణి ఖాతాలో ఉన్నాయి. ఇక తెలుగులో ప్రియమణి నటిస్తున్న రెండు చిత్రాలు వేటికవే ప్రత్యేకం. రానా సాయి, పల్లవి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న విరాటపర్వం లవ్ అండ్ రివల్యూషనరీ డ్రామా. ఇక వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న నారప్ప మూవీలో వర్ణవివక్షత ప్రధాన అంశం. 


విరాటపర్వం చిత్రంలో ప్రియమణి లేడీ నక్సలైట్ పాత్ర చేస్తున్నారు. భారతక్క అనే సీరియస్ అండ్ ఎమోషనల్ రోల్ లో ఆమె కనిపించనున్నారు. ఇక నారప్ప మూవీలో వెంకటేష్ భార్యగా నడివయసు మహిళ పాత్ర చేస్తున్నారు. కాగా తాజా ఇంటర్వ్యూ లో నారప్ప చిత్రం గురించి ఆమె స్పందించారు. ఈ చిత్రం ద్వారా వెంకటేష్ గారితో నటించాలన్న తన కోరిక నెరవేరిందని తెలియజేసింది. గతంలో రెండు మూడు స్టార్లు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారినట్లు ప్రియమణి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. 


సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన నారప్ప, విరాటపర్వం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. మరోవైపు ప్రియమణి నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది. నటుడు మనోజ్ బాజ్ పాయ్ భార్యగా ప్రియమణి ఈ సిరీస్ లో కనిపించనున్నారు. సమంత ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ నందు కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే .