నిర్మాతపై ఫిర్యాదు చేసిన ప్రియమణి

First Published 15, Mar 2018, 7:38 PM IST
priyamani complaints against producer
Highlights
  • నిర్మాతపై ఫిర్యాదు చేసిన ప్రియమణి

తెలుగు పరిశ్రమలో హిరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి. ప్రేమ్‌ ఆర్యన్ దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో ‘అంగుళీక’ అనే చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారు. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకొన్నారు. అయితే తాను తప్పుకొన్న చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాల్లో  తన ఫొటోలు ఉపయోగించుకున్నారని ఆరోపిస్తూ సినీ నటి ప్రియమణి సదరు చిత్ర నిర్మాతపై మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)కు ఫిర్యాదు చేశారు.

 

ప్రియమణికి ‘అంగుళీకం’ కథ చెప్పి, అందులో నటించాల్సిందిగా దర్శక, నిర్మాతలు తొలుత ఆమెను సంప్రదించారు. అందుకు ప్రియమణి కూడా అంగీకరించడంతో ఫొటోషూట్‌ జరిగింది. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం నుంచి ప్రియమణి తప్పుకొన్నారు. అనంతరం ఇందులో కథానాయిక పాత్రకోసం వేరొకరిని సంప్రదించారు. అయితే ఈ చిత్రం ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రచారంలో భాగంగా చిత్రబృందం మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసింది. ఇందులో‌ ప్రియమణి చిత్రాలను వాడుకున్నారంటూ ఆమె ప్రతినిధులు ‘‌మా’కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

loader