ఈ చిత్రం ఫుల్ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టు చెప్తున్నారు.  


‘దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్’ బ్యానర్ పై శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మించిన చిత్రం ‘బలగం’. మొన్న శుక్రవారం రిలీజైన ఈ చిత్రం పూర్తి తెలంగాణా నేపధ్యంలో వచ్చి క్లిక్ అయ్యింది. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ‘జబర్దస్త్’ కమెడియన్ వేణు టిల్లు అలియాస్ వేణు ఎల్దండి ద‌ర్శ‌కుడు. మార్చి 3న రిలీజ్ అయిన ఈ చిత్రం ఫుల్ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టు చెప్తున్నారు. ఈ చిత్రం కలెక్షన్స్ వైజ్ చూస్తే మొదటి రోజు పెద్దగా లేదు. మెల్లి మెల్లిగా పుంజుకుంటోంది.

మొదటి రోజు వచ్చిన గ్రాస్ కంటే వర్కింగ్ డే అయినా నాలుగో రోజు వచ్చిన గ్రాసే ఎక్కువ ఉందని తెలు్సోతంది. ఈ సినిమా నాలుగు రోజుల్లో నైజాం ఏరియాలో 2.5 కోట్ల గ్రాస్ సాధించింది. కలెక్షన్స్ లో డ్రాప్ పెద్దగా కనపడటం లేదు. నాని దసరా వచ్చేదాకా ఈ కలెక్షన్స్ కంటిన్యూ అవుతాయని అంచనా వేస్తున్నారు. 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.68 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసిన 'బలగం' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి దీనికి నాలుగు రోజుల్లో రూ. 7 లక్షలు గ్రాస్ వసూలు అయింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.75 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 1.56 కోట్లు షేర్ కలెక్ట్ వచ్చినట్లు గా చెప్తున్నారు.

‘బలగం’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.2 కోట్లు కాగా.. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.1.27 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.0.07 కోట్లు ప్రాఫిట్స్ ను అందించింది. నైజాంలో ఈ మూవీ బాగా కలెక్ట్ చేస్తుంది. 

 తెలంగాణ‌లోని మారుమూల ప‌ల్లెటూళ్లో మ‌నుషుల మ‌ధ్య బంధాలు, గొడ‌వ‌ల‌ను, భావోద్వేగాల‌ను ప్ర‌ధానంగా చేసుకుని బలగం’ సినిమా నచ్చుతుంది. ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజై మంచి రివ్యూలు తెచ్చుకుంది. ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని Amazon Prime Video మంచి రేటు ఇచ్చి సొంతం చేసుకుంది. మెల్లి మెల్లిగా మౌత్ టాక్ జనాల్లోకి వెళ్తున్న ఈ చిత్రం ఒక నెల తర్వాత ఓటిటిలోకు వస్తుందని సమాచారం. ఇక ఈ చిత్రం చేసినందుకు దిల్ రాజుకు మంచి ప్రశంసలు తెలంగాణా సమాజం నుంచి వస్తున్నాయి. వాస్తవానికి ఇలాంటి క‌థ‌తో సినిమా చేయడం మాత్రం సాహ‌స‌మే. శ‌వం ముందు జాగారం చేసే స‌మ‌యంలో.. పాట‌లు పాడుకోవ‌డం, కాకి పిండం ముట్ట‌క‌పోతే.. కుటుంబ ఘ‌న‌తను, బాధ్య‌త‌లూ చెప్పటం వంటివి క‌నిపిస్తాయి. తెలంగాణ సంస్కృతిలో పెరిగిన వాళ్ల‌కు ఆయా స‌న్నివేశాల‌న్నీ హృదయాన్ని తాకే అవ‌కాశం ఉంది. అలాగే ఇదే డైరక్టర్ వేణు కు ఆయన తన బ్యానర్ లో నెక్ట్స్ ప్రాజెక్టు ఇచ్చినట్లు సమాచారం.

 ఇంతకీ ఈ చిత్రం కథేమిటంటే..

 కొముర‌య్య (సుధాక‌ర్‌రెడ్డి) తాతకి ఊరంతా భారీ బంధువర్గం ఉన్నా మానసికంగా ఒంట‌రి. ఏదో అవేదనతో ఉంటాడు. దాన్ని కప్పెట్టి వయస్సు తో సంభందం లేకుండా ఊళ్లో అందరితో పరాచికాలు ఆడుతూ, అవసరమైతే మందలిస్తూ, నవ్విస్తూ..నవ్వుతూ లైఫ్ ని ఈజీగా తీసుకుని బ్రతుకు సాగిస్తూంటాడు. అతని కొడుకులు ఐల‌య్య‌, మొగిల‌య్యల‌ు. అలాగే ఓ కూతురు ల‌క్ష్మి. ఈ కూతురు,ఆమె భర్త అంటే కొడుకులకు గిట్టదు. ఎప్పుడూ ఏవో గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. ఇదిలా ఉంటే ఐల‌య్య కొడుకు సాయిలు(ప్రియ‌ద‌ర్శి) అప్పుల్లో మునిగిపోతాడు. సొంతం వ్యాపారం చేసి ఎదగాలని చివరకు ఉన్న ఎకరం భూమిని సైతం అమ్మేస్తాడు. అప్పులు మిగిలుతాయి. దాని నుంచి బయిటపడాలంటే కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. 15 లక్షలకు ఓ సంభందం సెట్ చేసుకుని పెళ్లి పీటలకు ఎక్కడానికి రెడీ అవుతాడు. 

రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్. ఈ లోగా తాత చచ్చిపోతాడు. పెళ్లి ఆగిపోతుంది..తను అప్పులు ఎలా తీరుస్తాడు అనే బెంగలో ఉండగా...తన తాత ని చూడటానికి తన మేనత్త కూతురు,మరదలు సంధ్య‌ (కావ్య క‌ళ్యాణ్ రామ్‌) వస్తుంది. ఆమెను లైన్ లో పెట్టి పెళ్లి చేసుకుంటే పెద్ద ఆస్తి సొంతమై ఒడ్డున పడిపోతాడనే ఆశ మళ్లీ చిగురిస్తుంది. ఆ ప్రయత్నాలు మొదలెడతాడు. అయితే ఈ లోగా ఇంట్లో ఓ సమస్య వస్తుంది..తాతకు పెట్టిన పిండం కాకి ముట్టడం లేదు..ఎందుకిలా జరుగుతోంది. తాత చచ్చి ఏం సాధించదలుచుకున్నాడు.... కొమురయ్య మనస్సులో ఏముంది...సాయిలు కు పెళ్లి అయ్యిందా..అప్పులు తీరాయా... చివరకు ఏమైంది అనేది మిగతా కథ.