దాదాపు ప‌ది కోట్ల బ‌డ్జెట్ బ‌డ్జెట్‌తో డార్లింగ్ మూవీ రూపొందిన‌ చెప్తున్నారు. 


 ప్రియదర్శి పులికొండ నటించిన తాజా సినిమా 'డార్లింగ్' . ఇందులో నభా నటేష్ (Nabha Natesh) హీరోయిన్. 'హనుమాన్' వంటి భారీ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ అందించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వస్తున్న చిత్రం కావటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాని కె నిరంజన్ రెడ్డి, ఆయన సతీమణి చైతన్య రెడ్డి నిర్మించారు. జూలై 19న... అంటే ఈ శుక్రవారం 'డార్లింగ్' థియేటర్లలోకి వచ్చింది. ఒక్క రోజు ముందు ప్రీమియర్ షోలు వేసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఏ స్దాయిలో జరిగింది..ఎంతకు అమ్మారు..ఎంతొస్తే బ్రేక్ ఈవెన్ వంటి వివరాలు చూద్దాం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దాదాపు ప‌ది కోట్ల బ‌డ్జెట్ బ‌డ్జెట్‌తో డార్లింగ్ మూవీ రూపొందిన‌ చెప్తున్నారు. ప్రియదర్శిపై పది కోట్లు అంటే పెద్ద మొత్తమే. అయితే ఈ సినిమా థియేట్రిక‌ల్ బిజినెస్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏడు కోట్ల వ‌ర‌కు జ‌రిగిందని వినికిడి. ఓటీటీ, శాటిలైట్ వంటి నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ద్వారా మ‌రో ఎనిమిది కోట్లు వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. మొత్తంగా రిలీజ్‌కు ముందే ఈ సినిమా ప‌దిహేను కోట్ల వ‌ర‌కు తిరిగి రాబ‌ట్టింది. మేక‌ర్స్‌కు డార్లింగ్ ఐదు కోట్ల వ‌ర‌కు లాభాల‌ను మిగిలిందని చెప్తున్నారు.

నిర్మాతకు ఎంత లాభం వచ్చిందనేది ప్రక్కన పెడితే థియేటర్ బిజినెస్ 7 కోట్లుకు అయ్యింది కాబట్టి బ్రేక్ ఈవెన్ కావాలంటే షేర్ ఎనిమిది కోట్లు రావాలి. అంటే గ్రాస్ దాదాపు 13 నుంచి 15 కోట్లు లోపు రావాలి. ప్రియదర్శి సినిమాకు ఆ స్దామినా ఉందా అంటే బలగం సినిమా బాగా వసూలు చేసింది. కాబట్టి నమ్మచ్చు. మరికొద్ది సేపట్లో సినిమాకు వచ్చే టాక్ ని బట్టి ఏ స్దాయి పే చేస్తుందని ఓ అంచనాకు రావచ్చు.

ఇక ఈ డార్లింగ్ సినిమాలో మ‌ల్టీపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్‌ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే అమ్మాయిగా న‌భాన‌టేష్ క‌నిపిస్తోంది. పెళ్లి త‌ర్వాత భార్య‌కు మ‌ల్టీపుల్‌ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ ఉంద‌ని తెలిసి ఓ భ‌ర్త ఏం చేశాడు? ఈ స‌మ‌స్య కార‌ణంగా ఆ భ‌ర్త ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడు? భార్య‌కున్న స‌మ‌స్య‌ను అర్థం చేసుకున్నాడా లేదా అన్న‌దే ఈ మూవీ క‌థ‌ గా చెప్తున్నారు. డార్లింగ్ మూవీలో అన‌న్య నాగ‌ళ్ల ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది.