ఒక్క కన్నుగీటితో యూత్ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన 'ఒరు అడార్ లవ్' చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను 'లవర్స్ డే' పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది ప్రియా ప్రకాష్. తెలుగులో సినిమా ఆడియో ఫంక్షన్ కి అల్లు అర్జున్ అతిథిగా రావడంపై స్పందించిన ఈ బ్యూటీ అసలు ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానని, అల్లు అర్జున్ కోసం తనతో పాటు యూనిట్ మొత్తం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

గతంలో అల్లు అర్జున్ గారితో నటించే చాన్స్ వచ్చిందని కొన్ని కారణాల వలన సినిమా చేయలేకపోయానని వెల్లడించింది. ఇక గతేడాదిలో తనకు వచ్చిన అనూహ్యమైన క్రేజ్ తో కాస్త ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఏం జరుగుతుందో అర్ధమయ్యేది కాదని, ఎక్కడ చూసిన జనాలే ఉండేవారని, ఇంటి వద్ద తన కోసం జనాలు వస్తుండడంతో చాలా ఇబ్బందిగా అనిపించేదని తెలిపింది.

ఈ క్రమంలో తన తల్లితండ్రులు బయటకి వెళ్లనివ్వకుండా చాలా వారాల పాటు హౌస్ అరెస్ట్ చేసినంత పని చేశారని చెప్పుకొచ్చింది. ఇంట్లో నుండి బయటకి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్లు గుర్తుచేసుకుంది. ఫేం వచ్చిన సమయంలోనే చాలా రూమర్లు కూడా వచ్చినట్లు, మొదట్లో వాటి గురించి ఆలోచించినా.. ఇప్పుడు మాత్రం అసలు పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది. 

కన్ను గీటిన భామ ప్రియాప్రకాష్ క్యూట్ లుక్ (ఫోటోలు)