ప్రియా ప్రకాష్‌ వారియర్‌.. ఈ అమ్మడు తెలియని సోషల్‌ మీడియా అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. తొలి సినిమాతోనే దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యింది. ఒక కన్నుగీటుతోనే కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకుంది. కలల రాణిలా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నితిన్‌ సరసన `చెక్‌` చిత్రంలో నటించింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఓ వీడియోని షేర్‌ చేసుకుంది. 

ఇందులో ప్రియా ప్రకాష్‌ వారియన్‌ నితిన్‌పైకి ఎక్కే క్రమంలో జారి కింద పడిపోయింది. `చెక్‌` చిత్ర షూటింగ్‌లో ఓ పాత కోటలో నితిన్‌, ప్రియా మధ్య లవ్‌ ఎపిసోడ్‌ సాగుతుంది. ఇందులో ప్రియా పరుగెత్తుకుంటూ వచ్చి వెనకాల నుంచి నితిన్‌ వీపు పైకి ఎక్కాల్సి ఉంటుంది. కానీ సరిగా ఎగరలేక ప్రియా వెల్లకిలా కింద పడిపోయింది. ఫన్నీగా ఉన్న ఈ సీన్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ వీడియోని పంచుకుంటూ, `జీవితంలో కింద పడిపోతున్న ప్రతిసారి నేను నమ్మకంతో పైకి లేచేందుకు ప్రయత్నిస్తున్నాననే విషయాన్ని ప్రతిబింబిస్తుంది` అని పేర్కొంది ప్రియా.