కన్నుగీటి బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ పై ఇటీవల చాలా విమర్శలు వినిపించాయి. ఆమె నటించిన 'ఒరు అడార్ లవ్' సినిమాను తెలుగులో 'లవర్స్ డే' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

కానీ ఈ సినిమాకు సంబంధించి ఏదోక వార్త హైలైట్ అవుతూనే ఉంది. ముందుగా సినిమాలో మరో నటి నూరిన్ షరీఫ్.. ప్రియాపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. తన కారణంగానే ఆమెని హీరోయిన్ గా తప్పించారని వాపోయింది.

ఆ తరువాత చిత్ర దర్శకుడు ఒమర్ లులు.. ప్రియాఅసలు హీరోయిన్ కాదని, నిర్మాతల బలవంతం మీద స్క్రిప్ట్ మార్చాల్సి వచ్చిందని, ప్రియాకి నటించడం రాదని విమర్శించారు. ఈ విషయాలపై తాజాగా స్పందించిన ప్రియా ప్రకాష్.. అసలేం జరిగిందో చెబితే తనను విమర్శిస్తున్న వారి పరువు పోతుందని చెప్పింది.

'తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, తనను విమర్శిస్తున్న వారికి కాలమే సమాధానం చెబుతుందని.. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని కామెంట్ చేసింది.