కన్నుగీటి యూత్ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది నటి ప్రియా ప్రకాష్ వారియర్. ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సెలబ్రిటీగా ప్రియా నిలిచింది. గత రెండేళ్లుగా గూగుల్ సెర్చ్ లో టాప్ లో ఉండేది పోర్న్ స్టార్, నటి సన్నీలియోన్. కానీ ప్రియాప్రకాష్ ఈసారి సన్నీలియోన్ ని బీట్ చేసి మరీ అగ్ర స్థానంలో నిలిచింది.

'ఒరు అడార్ లవ్' సినిమాలో ఒక పాటలో కన్నుకొడుతూ చక్కటి హావభావాలు కనబరిచిన ప్రియా వారియర్ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.ఆ సినిమా విడుదల కాకుండానే ప్రియా వారియర్ కి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆమె పాపులారిటీ నార్త్ కి కూడా పాకింది. చాలా మంది తారలు ఆమెను పొగుడుతూ ట్వీట్లు పెట్టారు.

ఎప్పుడైతే ప్రియా కన్నుగీటిన వీడియో ఆన్ లైన్ లో కనిపించిందో.. అందరూ ఆమె గురించి తెలుసుకోవాలనే  ఆసక్తితో గూగుల్ లో వెతకడం మొదలుపెట్టారు.ఈ క్రమంలో అత్యధిక మంది సెర్చ్ చేసిన భారతీయ సెలబ్రిటీగా మొదటి స్థానం సంపాదించుకున్నారు.

రెండో స్థానంలో ప్రముఖ భారతీయ నృత్యకారిణి సప్నా చౌదరి ఉన్నారు.  మూడో స్థానంలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహూజా, నాలుగో స్థానంలో ప్రియాంక చోప్రా నిలిచారు.