Asianet News TeluguAsianet News Telugu

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఇప్పుడీ పనులేంటి?

సినిమా రిలీజ్ కు ముందే ఏ మార్పులు అయినా చెయ్యాలి. రిలీజ్ అయ్యి టాక్ తేడా వచ్చేసాక ...ట్రిమ్ చేసినా లేదా మరొకటి చేసినా పెద్దగా ఫలితం ఉండదని చాలా సార్లు చరిత్ర ప్రూవ్ చేసింది. 

Priya Prakash Varrier Lovers Day climax changed
Author
Hyderabad, First Published Feb 19, 2019, 11:34 AM IST

సినిమా రిలీజ్ కు ముందే ఏ మార్పులు అయినా చెయ్యాలి. రిలీజ్ అయ్యి టాక్ తేడా వచ్చేసాక ...ట్రిమ్ చేసినా లేదా మరొకటి చేసినా పెద్దగా ఫలితం ఉండదని చాలా సార్లు చరిత్ర ప్రూవ్ చేసింది. అయితే ఆశ పోక మార్పులు చేస్తూంటారు దర్శక,నిర్మాతలు. ఇప్పుడు అలాంటి మార్పులే  ప్రియ ప్రకాష్ వారియర్ చిత్రం లవర్స్ డే కు చేయబోతున్నారు. 

వివరాల్లోకి వెళితే...ప్రియా ప్రకాశ్‌ వారియర్, రావూఫ్‌ రోషన్‌ జంటగా నటించిన చిత్రం ‘లవర్స్‌ డే’ (మలయాళంలో ‘ఒరు ఆడార్‌ లవ్‌). ఒమర్‌ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి సుఖీభవ సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మాతలు ఎ.గురురాజ్, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి అందించారు. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) విడుదల అయ్యిది.

ప్రియా ప్రకాశ్‌ ద్వారా సినిమాకు ఎంతో పాపులారిటీ వచ్చింది కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్‌ వద్ద డీలాపడిపోయింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని క్లైమాక్స్‌ భాగం ప్రేక్షకులను నిరాశకు గురిచేసిందని రివ్యూలు వచ్చాయి. దాంతో కేవలం క్లైమాక్స్‌ సన్నివేశాన్ని మార్చాలని దర్శక,నిర్మాతలు  నిర్ణయించారు.  బుధవారం నుంచి కొత్త క్లైమాక్స్ సన్నివేశంతో సినిమా ప్రదర్శిస్తామని దర్శకుడు ఒమర్‌ వెల్లడించారు.

డైరక్టర్ మాట్లాడుతూ...‘క్లైమాక్స్‌ సన్నివేశంలో మార్పులు చేసి మళ్లీ చిత్రీకరించాం. పది నిమిషాల పాటు ఈ సన్నివేశం ఉండబోతోంది. బుధవారం నుంచి కొత్త క్లైమాక్స్‌తో సినిమా ప్రదర్శితమవుతుంది. నేను తీసిన మూడో చిత్రమిది. నా మొదటి రెండు సినిమాలు కూడా రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలోనే ఉంటాయి. 

దాంతో ‘ఒరు అడార్‌ లవ్’ సినిమాను రియలిస్టిక్‌గా తెరకెక్కించాలని అనుకున్నాను. అందుకే క్లైమాక్స్‌కు ట్రాజెడీనీ జోడించాను. కానీ ప్రేక్షకులు ఈ సన్నివేశంతో నిరాశకు గురయ్యారు. దాంతో ఆ సన్నివేశాన్ని మార్చాలని నేను, నిర్మాత నిర్ణయించుకుని కొత్తగా మళ్లీ తెరకెక్కించాం’ అని వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios