మలయాళీ భామ ప్రియా ప్రకాష్ వారియర్ తన సహ నటుడు, స్నేహితుడైన రోషన్ అబ్దుల్ ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈరోజు రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె రోషన్ తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

ఈ సందర్భంగా ఆమె తన పోస్ట్ లో.. ''నాకు అంత గొప్పగా మాటలు రావు.. కానీ నాకోసం ఎంతో చేసిన నీకు థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎన్ని సమస్యలు వచ్చినా నా వెన్నంటే ఉంటూ ప్రోత్సహించింది నువ్వు ఒక్కడివే. నాకోసం ప్రతీసారి ఎంతో రిస్క్ తీసుకున్నావ్. నీకోసం నేను ఇంత చేయగలనో లేదో తెలియదు. కానీ నేను నీకిచ్చే ప్రాముఖ్యత ఎంతో తెలియజేయాలనుకుంటున్నాను. నీ విలువ నా మాటలకంటే ఎక్కువనే విషయం నీకు ముందే తెలుసుగా.. జీవితంలో నువ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది.

రోషన్, ప్రియా జంటగా నటించిన 'ఒరు అడార్ లవ్' ప్రేమికులరోజునాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా నటిస్తోంది.