మంగళవారం ప్రారంభం నిన్నటి ఎపిసోడ్‌లోని మ్యాటర్‌ కంటిన్యూ అయ్యింది. ఇందులో శ్రీరామ్‌.. జెస్సీతో జరిగిన వాదనలో భాగంగా ఫుడ్‌ తినొద్దనే శ్రీరామ్‌ మాటపై షణ్ముఖ్‌, సిరి,జెస్సీ ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆ రోజు మొత్తం షణ్ముఖ్‌, సిరి, జెస్సీ ఫుడ్‌ తినలేదు. 

బిగ్‌బాస్‌5 హౌజ్‌ మంగళవారం ఎపిసోడ్‌ హీటెక్కిపోయింది. నిన్నటి ఘటనలతోపాటు ఈ రోజు మరో కొత్త ఇష్యూతో హాట్‌ హాట్‌గా సాగింది. షణ్ముఖ్‌, సిరి, జెస్సీ సపరేట్‌ గ్రూప్‌గా విడిపోయి సీక్రెట్‌ గేమ్‌ ప్లాన్‌లు చేసుకోవడం, కెప్టెన్‌ సెలక్ట్ చేసిన నలుగురు సభ్యులు తమకి లభించిన గిఫ్ట్ లను ఇంటికి పంపించడం, రవి, కాజల్‌ మధ్య గొడవలు, రాజ్యంలోని సింహాసనం కోసం ఇద్దరు రాజులు పోటీపడటం వంటి వాటితో ఈ రోజు షో రసవత్తరంగా సాగింది.

మంగళవారం ప్రారంభం నిన్నటి ఎపిసోడ్‌లోని మ్యాటర్‌ కంటిన్యూ అయ్యింది. ఇందులో sreeram.. jessiతో జరిగిన వాదనలో భాగంగా ఫుడ్‌ తినొద్దనే శ్రీరామ్‌ మాటపై షణ్ముఖ్‌, సిరి,జెస్సీ ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆ రోజు మొత్తం shanmukh, సిరి, జెస్సీ ఫుడ్‌ తినలేదు. మరోవైపు నా సభ్యులు ఫుడ్‌ తినకపోతే తాను కూడా తినని స్పష్టం చేశారు శ్రీరామ్‌. దీంతో హమీద కూడా ఫుడ్‌ తినకుండా ఉండిపోయింది. 

నెక్ట్స్ మార్నింగ్‌తో ఆ విషయం క్లోజ్‌ అయ్యింది. ఆ తర్వాత లోబో విషయంలో kajal, ancho raviలకు గొడవ స్టార్ట్ అయ్యింది. లోబో తన మిడిల్‌ ఫింగర్‌ చూపించాడని ఇష్యూ లెవనెత్తింది కాజల్‌. దానికి లోబో తాను ఆ ఫింగర్‌ వాడలేదని వివరణ ఇచ్చారు. కానీ ఆమె పదేపదే లోబో విషయంలో స్వరం పెంచింది. రవి కూడా జోక్యం చేసుకోవడం, తాను అలా అనలేదని లోబో అనడంతో ఆమె కూల్‌ అయ్యింది. 

దానికి వివరణ ఇస్తూ ప్రోవోకింగ్‌(రెచ్చగొట్టొద్దు) చేయోద్దు అని యాంకర్‌ రవి.. కాజల్‌కి సూచించారు. ఈ గొడవలో రవి, లోబో ఇన్నాళ్లు వాష్‌రూమ్‌(వాష్‌ రూమ్‌ క్లీన్‌)లో ఉండేవారని, ఇప్పుడు కిచెన్‌లోకి వచ్చారని కాజల్‌ వారితో సెటైరికల్‌గా అన్నది. దాన్ని రవి లేవనెత్తాడు. మమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతుందని వాదించారు రవి. ఈ విషయంలో కాజల్‌ సైతం స్వరం పెంచింది. దీంతో రవి, కాజల్‌ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఒకానొక దశలో వాదనలు పీక్‌లోకి వెళ్లాయి. కెప్టెన్‌ శ్రీరామ్‌ సముదాయించే ప్రయత్నం చేసినా వర్కౌట్‌ కాలేదు. కానీ కాజల్‌ మాట తప్పుతుందని రవి వెళ్లిపోవడంతో మ్యాటర్‌ క్లోజ్‌ అయ్యింది. 

also read: షణ్ముఖ్‌ కన్నింగ్‌ గేమ్‌.. వరస్ట్ పర్‌ఫెర్మర్‌ అంటూ దారుణంగా ట్రోలింగ్‌.. బిగ్‌బాస్‌5లో గ్రూపు రాజకీయాలు షురూ

ఆ తర్వాత biggboss5 ఇంటి సభ్యులను టాస్క్ ఇచ్చారు. కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్. ఇందులో రవి, సన్నీ యువరాజులుగా ఉంటారు. శ్రీరామ్‌ సంచాలకుడిగా, మిగిలిన వారు రాజ్యంలోని ప్రజలుగా ఉంటారు. యువ రాజులు ఈ పోటీలో నెగ్గి ఉన్న ఒకే ఒక సింహాసనాన్ని దక్కించుకోవాల్సి ఉంటుంది. రాజులు ప్రజల మద్దతు కూడగట్టుకుని టాస్క్ పూర్తయ్యేలోపు ఏ యువరాజుకి ప్రజల మద్దతు ఎక్కువ ఉంటుందో వాళ్లు సింహాసనాన్ని అధిరోహించవద్దని, వారు కెప్టెన్సీ పోటీదారులుగా ఉంటారని బిగ్‌బాస్‌ తెలిపారు. 

ఇందులో యాంకర్‌ రవి, సన్నీ ప్రజల మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అందుకోసం తమ వద్ద ఉన్న నాణేలను ఇచ్చేందుకు ఆశచూపుతున్నారు. సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. అయితే రవి వద్దకు వచ్చిన సిరి, ప్రియాలకు యువరాజు ఓ గేమ్‌ ఇచ్చాడు. ఇద్దరు నీళ్లకోసం వచ్చి బిద్దలతో కొట్టుకుంటే బాగుంటుందని చెప్పగా, సిరి, ప్రియా బిందెలతో గొడవలకు దిగారు. ఈ క్రమంలో ప్రియాని ఎండు చేప అంటూ కామెంట్‌ చేసింది సిరి. దీనికి ప్రియా సైతం రెచ్చిపోయి సొరచేప అంటూ సిరిని కామెంట్‌ చేసింది. 

మరోవపు రవి రాజ్యంలోని పెట్టేలోని నాణేలను జెస్సీ,సిరి కొట్టేయడం, ఆ తర్వాత విశ్వ ఆ విషయాన్ని లేవనెత్తి విమర్శడం ఇంట్లో హీట్‌ని పెంచింది. మరి ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం బిగ్‌బాస్‌ 5 ఐదో వారం కొనసాగుతుంది. నాలుగు వారాల పాటు విజయం వంతంగా సాగింది. నాలుగు వారాల్లో సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు లోబో, షణ్ముఖ్‌, జెస్సీ, సిరి, యాంకర్ రవి, మానస్‌, సన్నీ, విశ్వ, హమీద నామినేట్‌ అయిన విసయం తెలిసిందే.

also read: ప్రియ ఫిట్టింగ్ మాస్టర్, రవి నటిస్తున్నాడు... ఇక ఆ కంటెస్టెంట్ ఫోటోని కాలితో తన్నిన నటరాజ్ మాస్టర్