Asianet News TeluguAsianet News Telugu

`ది గోట్ లైఫ్‌` మూవీ కలెక్షన్లు.. సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఎంత వసూలు చేసిందంటే..? నిజంగా సర్‌ప్రైజింగ్‌

`సలార్‌` ఫేమ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. ఇటీవల `ది గోట్‌ లైఫ్‌` అనే సినిమాలో నటించారు. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీకి కలెక్షన్లు మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి. 
 

prithviraj sukumaran the goat life movie collections really surprising arj
Author
First Published Mar 31, 2024, 6:26 PM IST

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. `సలార్‌` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. దీంతో ఆయన నటించే చిత్రాలపై ఆసక్తి ఏర్పడింది. ఆయన సినిమాల కోసం తెలుగు ఆడియెన్స్ కూడా వెయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన్నుంచి `ది గోట్‌ లైఫ్‌` అనే సినిమా వచ్చింది. `ఆడుజీవితం` అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. గల్ఫ్‌ కంట్రీకి వెళ్లిన నజీబ్‌ అనే వ్యక్తి అక్కడ పడ్డ బాధలు, అక్కడి కఫీల్‌ నుంచి బయటపడేందుకు ఆయన పడ్డ స్ట్రగుల్స్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ గురువారం విడుదలైంది. 

మలయాళ దర్శకుడు బ్లెస్సీ రూపొందించారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. నజీబ్‌ పాత్రలో నటించారు. నజీబ్‌ జీవితాన్ని యదాథతంగా వెండితెరపై ఆవిష్కించారు బ్లెస్సీ. దీంతో సినిమా డ్రైగా మారింది. ఇది సినిమాపై మిశ్రమ అభిప్రాయానికి కారణమయ్యింది. అయినా ఈ మూవీకి మంచి స్పందన లభిస్తుంది. కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపిస్తుంది. పాన్‌ ఇండియా స్థాయిలో దీన్ని రిలీజ్‌ చేయగా, ఇప్పటి వరకు యాభైకోట్ల కలెక్షన్లని రాబట్టడం విశేషం. ఇలాంటి డ్రై ఫిల్మ్ కి ఈ స్థాయి కలెక్షన్లు రావడం చాలా అరుదైన విషయమనే చెప్పాలి. 

కేరళాలో ఇలాంటి సంఘటలు చాలా చోటు చేసుకుంటాయి. అక్కడి జనం ఇలా విదేశాలకు వలస వెళ్తుంటారు. ఎంతో స్ట్రగుల్ అవుతుంటారు. అలా ఈ మూవీకి అక్కడ విశేష ఆదరణ దక్కుతుందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీకి ఆల్మోస్ట్ 16ఏళ్ల క్రితం అనుకున్నారు. ఆరేళ్ల క్రితం నుంచి షూట్‌ చేశారు. రియల్‌ లొకేషన్‌లో చిత్రీకరించారు. రియల్‌ ఎడారుల్లో చిత్రీకరించారు. దీంతో షూటింగ్‌ ఆలస్యమయ్యింది. 

మరోవైపు పాత్ర కోసం పృథ్వీరాజ్‌ డెడికేషన్‌తో వర్క్ చేశారు. ఆయన భారీగా బరువుతగ్గారు. చాలా సన్నగా మారారు. మూడు వేరియేషన్స్ చూపించారు. ఓ నటుడు ఇంతటి డెడికేషన్‌తో వర్క్ చేయడం మామూలు విషయం కాదు. బాడీ ట్రాన్ఫర్మేషన్‌ మాత్రమే కాదు, నజీబ్‌ పాత్రకి ప్రాణం పోశాడు. ఆ బాధలను, స్ట్రగుల్స్ ని ఆడియెన్స్ కళ్లకి కట్టినట్టు చూపించాడు. అయితే దర్శకుడు కొంత సినిమాటిక్‌ లిబర్టీ తీసుకుని మూవీని తెరకెక్కించి ఉంటే `ది గోట్‌ లైఫ్‌` సంచలనాలు సృష్టించేదని చెప్పొచ్చు.  ఈ మూవీని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేయగా, ఇక్కడ పెద్దగా స్పందన లేదని టాక్‌. 
 

Follow Us:
Download App:
  • android
  • ios