Asianet News TeluguAsianet News Telugu

‘లవ్ స్టోరీ’ నాన్ థియేటర్ బిజినెస్..నిర్మాత డాన్స్ చేయాలనిపించేటంత

 సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. ప్రేమకథలను సహజంగా తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్న శేఖర్‌ కమ్ముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథగా తెరకెక్కుతున్న  ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది.. భారీ అంచనాలున్న ఈ ప్రేమ కావ్యాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.. హాట్ సమ్మర్ లో కూల్ లవ్ స్టోరీని ఎంజాయ్ చేయబోతున్నారు ప్రేక్షకులు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రి రిలీజ్ బిజినెస్ ఎంత అయ్యింటుందనే ఆసక్తి సినీ లవర్స్ లో కలగటం సహజం. థియేటర్ బిజినెస్ అనేది నిర్మాతలే ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి ఖచ్చితంగా ఇంత అనేది తెలియదు. అయితే నాన్ థియేటర్ రైట్స్ మాత్రం బాగానే పలికినట్లు సమాచారం. 
 

Price for Love Story Non-Theatrical Rights jsp
Author
Hyderabad, First Published Feb 1, 2021, 7:01 PM IST

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని కలిపి 16 కోట్లు దాకా పలికాయని తెలుస్తోంది. దాంతో నిర్మాతలు ఫుల్ ఖుషీలో ఉన్నట్లు చెప్తున్నారు. ఇంక థియేటర్ బిజినెస్ అదనం. దాంతో రిలీజ్ కు ముందే లాభాలు పంట అంటున్నారు. 

 ఇక ఫిదా వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ ఆ తర్వాత ఎలాంటి  కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వారి ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల. మజిలీ వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా  సినిమాలు చేస్తోన్న నాగచైతన్య హీరోగా.. తన డైరెక్షన్ లోనే వచ్చిన ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా చేయడం తో ఈ  ప్రాజెక్ట్ పై క్రేజ్ పెరిగింది.

 డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈసినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పాటు శేఖర్ ఎంచుకున్న కాస్ట్ కూడా ప్రాజెక్ట్ కు పెద్ద ఎస్సెట్ గా అయింది.  
 
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్
మ్యూజిక్ : పవన్ సి.హెచ్
సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు
రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

Follow Us:
Download App:
  • android
  • ios