బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సొనాలీ బింద్రే  (Sonali Bindre) పలువురు నిర్మాతలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అడర్ వరల్డ్ ఒత్తిళ్లతోనే తను కొన్ని సినిమాలు కోల్పోవాల్సి వచ్చిందని వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. 

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సొనాలీ బింద్రే (Sonali Bindre) అంటే తెలియని ప్రేక్షకుడు ఉండదు. తన అందం, అభినయంతో సౌత్, నార్త్ అభిమానులకు దగ్గరైంది. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తిరుగులేని హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. సోనాలీ తెలుగు ప్రేక్షకులకు కూడా చాలానే దగ్గరని చెప్పాలి. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో ‘మురారి’తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం సాలిడ్ హిట్ కావడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ఆ తర్వాత ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు, పల్నాటి బ్రహ్మనాయుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాల్లో నటించింది.

అయితే, 2002లోనే బాలీవుడ్ నిర్మాత గోల్డీ బెహ్ల్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పదేండ్ల పాటు చిత్రాల్లో నటించి.. ప్రస్తుతం టీవీ సీరియల్స్, సిరీస్ లలో నటిస్తోంది. ఇదిలా ఉంటే సొనాలీకి ఎదురైన ఓ చేధు అనుభవాన్ని తాజాగా వెల్లడించింది. పలువురు నిర్మాతలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అడర్ వరల్డ్ ఒత్తిళ్లతోనే తను కొన్ని సినిమాలు కోల్పోవాల్సి వచ్చిందని వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. కొందరు ‘దొంగ’ నిర్మాతల వల్ల నష్టపోయాయని తెలిపింది. బాలీవుడ్ లో అండర్‌వరల్డ్‌ ఒత్తిడి వల్లే పలు సినిమాలు కోల్పోయానని గుర్తు చేసుకుంది. అయితే ఈ ఘటన 90వ దశకంలో సినీ పరిశ్రమ అండర్ వరల్డ్ ప్రభావంలో ఉన్న సమయంలోనే తాను సినిమాలకు దూరమయ్యానని సోనాలి బింద్రే తెలిపారు. సినిమా నిర్మాతలను అర్థం చేసుకోవడంలో తన భర్త గోల్డీ బెల్ సహాయం చేశారని పేర్కొంది. 

సోనాలి చివరి ప్రాజెక్ట్ ది బ్రోకెన్ న్యూస్ జూన్ 10న Zee5లో విడుదలైంది. ఇందులో జైదీప్ అహ్లావత్ మరియు శ్రియా పిల్గావ్కర్ కూడా నటించారు. వినయ్ వైకుల్ దర్శకత్వం వహించారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సోనాలి 1994లో ‘ఆగ్’ హిందీ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి తిరుగులేని హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. చివరిగా ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబయి’లో నటించింది. 2013 తర్వాత నుంచి సినిమాలకు శాశ్వతంగా దూరమైంది.