RRR పై బ్రెజిల్ ప్రెసిడెంట్ పిచ్చి ప్రేమ.. ఇండియా ప్రస్తావన వస్తే చాలట, క్రేజీ కామెంట్స్ వైరల్
వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాలలో ఆర్ఆర్ఆర్ చూపినంత ప్రభావం మరే చిత్రం చూపించలేదనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ కి మాత్రమే ఆ ఘనత సాధ్యం అయింది.

వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాలలో ఆర్ఆర్ఆర్ చూపినంత ప్రభావం మరే చిత్రం చూపించలేదనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ కి మాత్రమే ఆ ఘనత సాధ్యం అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హాలీవుడ్ దిగ్గజాలు, సెలెబ్రిటీలు ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఇప్పటికే ఫిదా అయ్యారు. అయితే దేశాధి నేతలని సైతం ఆర్ఆర్ఆర్ చిత్రం కదిలిస్తుంది.
ప్రస్తుతం ఇండియాలో జి20 సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా ఆర్ఆర్ఆర్ చిత్రంపై క్రేజీ కామెంట్స్ చేశారు. సదస్సులో ప్రసంగిస్తూ ఆర్ఆర్ఆర్ చిత్రంపై లూలా తన పిచ్చి ప్రేమని వ్యక్తం చేయడం విశేషం.
లూలా మాట్లాడుతూ ' ఆర్ఆర్ఆర్.. మూడుగంటల ఫీచర్ ఫిలిం ఇది. ఈ చిత్రంలో చాలా ఆసక్తికర సన్నివేశాలు ఉన్నాయి. అద్భుతమైన డ్యాన్స్ ఉంది. అలాగే బ్రిటిష్ రూలింగ్ పై లోతైన విమర్శ ఉంది. ఇండియా గురించి ఎవరు ప్రస్తావన తీసుకువచ్చినా మీరు ఆర్ఆర్ఆర్ మూవీ చూశారా అని అడుగుతున్నా అంటూ లూలా కామెంట్స్ చేశారు.
ఈ చిత్రాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడికి, నటీనటులకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నా అంటూ లూలా మాట్లాడడం విశేషం. బ్రెజిల్ అధ్యక్షుడే ఈ స్థాయిలో ఫిదా అయ్యాడంటే మామూలు విషయం కాదని అంటున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రం నాటు నాటు సాంగ్ కి గాను ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ అల్లూరి, కొమరం భీమ్ పాత్రల్లో నటించగా అలియా భట్, ఒలీవియా మోరిస్ ఫీమేల్ లీడ్స్ గా నటించారు.