రొమాంటిక్‌ కామెడీగా వచ్చిన `ప్రేమలు` ఇటీవల ఎంతగానో సంచలనం సృష్టించింది. తెలుగులోనూ ఆదరణ పొందుతుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యింది.  

చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించింది `ప్రేమలు` మూవీ. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ సంచలనం విజయం సాధించింది. హైదరాబాద్‌ బేస్డ్ గా సాగే ఈ మలయాళ ఫిల్మ్ కేరళాలో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇది వంద కోట్లు వసూలు చేసింది. గత వారం తెలుగులో విడుదలైంది. ఇక్కడ ఓ మోస్తారు ఆదరణ దక్కింది. పెద్దగా పబ్లిసిటీ లేకపోవడంతో జనాలకు రీచ్‌ కాలేదు. పైగా ఆల్‌రెడీ మలయాళ వెర్షన్‌ చాలా మంది చూసేశారు. దీంతో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదు. మంచి ప్రమోషన్స్ చేసి ఉంటే సినిమా నెక్ట్స్ లెవల్కి వెళ్లేది. 

కానీ ట్రెండీ డైలాగ్‌లు, హైదరాబాద్‌ బేస్డ్ లవ్‌ స్టోరీ కావడంతో మన తెలుగు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా డబ్బింగ్‌లో తెలుగు డైలాగ్‌లు చాలా క్యాచీగా ఉన్నాయి. `గుంటూరు కారం` డైలాగ్‌లు, కుమారీ అంటీ డైలాగ్‌లో హిలేరియస్‌గా పేలాయి. పూర్తి ఫన్‌ లవ్‌ స్టోగా ఆద్యంతం ఆకట్టుకుంది. రెండో వారంలో కూడా ఈ మూవీకి అంతో ఇంతో ఆదరణ దక్కుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో రాబోతుంది. త్వరలోనే ఇది డిజిటల్‌లో స్ట్రీమింగ్‌ కాబోతుంది. 

మార్చి 29 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది. `ప్రేమలు` ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ దక్కించుకుంది. అయితే ఈ మూవీ మలయాళంలో విడుదలై నెల రోజులు దాటింది. దీంతో మార్చి మొదటి వారంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలనుకున్నారు. కానీ తెలుగు డబ్బింగ్‌ హక్కులను రాజమౌళి కొడుకు కార్తికేయ తీసుకున్నారు. ఇక్కడ మార్చి 8న థియేటర్‌లో విడుదల చేశారు. 

ఈ శుక్రవారం నుంచి తమిళంలోనూ రిలీజ్‌ చేశారు. దీంతో ఓటీటీ రిలీజ్‌ వాయిదా వేశారు. ఫైనల్‌గా అన్ని భాషల్లో మార్చి 29న విడుదల చేయబోతున్నారు. గిరీష్‌ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నస్లేన్‌ కె గపూర్‌, మమితా బైజు జంటగా నటించారు. వీరిద్దరి లవ్‌ స్టోరీ, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఫన్‌ బాగా పండాయి. ముఖ్యంగా ఆది పాత్రలో నటించిన శ్యామ్‌ అదరగొట్టాడు. 

Read more: మంచు మనోజ్‌ విలన్‌, తేజ, దుల్కర్‌ సల్మాన్‌ హీరోలుగా సినిమా..? అదిరిపోయే అప్‌డేట్‌