మంచు మనోజ్‌ విలన్‌గా టర్న్ తీసుకుంటున్నాడు. యంగ్‌ హీరోలకు ప్రత్యర్థిగా కనిపించబోతున్నారు. ఈ లేటెస్ట్ టాలీవుడ్‌ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.  

మంచు మనోజ్‌ సినిమాలకు బ్రేక్‌ ఇచ్చాడు. ఇటీవల తాను మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న ప్రకటించారు. `వాట్‌ ది ఫిష్‌` అనే సినిమాని ప్రకటించారు. దాన్నుంచి ఇప్పటి వరకు అప్‌డేట్‌ లేదు. ఆ మధ్య `ఉస్తాద్‌` పేరుతో సెలబ్రిటీ గేమ్‌ షోని ప్రారంభించారు. ఇది అంతంత మాత్రంగానే ఆదరణ పొందుతుంది. హీరోగా సినిమా ఏంటనేది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విలన్‌గా టర్న్ తీసుకుంటున్నాడట. 

మంచు మనోజ్‌ విలన్‌గా సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడట. తాజాగా ఆ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. ఆయన విలన్‌గా `హనుమాన్‌` ఫేమ్‌ తేజ సజ్జా హీరోగా నటిస్తారని తెలుస్తుంది. అంతేకాదు, మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ మరో హీరో అని టాక్‌. తేజ, దుల్కర్‌ హీరోలుగా, మంచు మనోజ్‌ విలన్‌గా సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్‌ జరుగుతుందట. దీనికి `ఈగల్‌` ఫేమ్‌ కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. 

ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ ఫైనల్‌ అయ్యిందట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్ ని సెట్‌ చేసిందంటున్నారు. దీనికి `మిరై` అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందట. అయితే ఈ మూవీకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లేటెస్ట్ సమాచారం మేరకు ఇందులో దుల్కర్‌ సల్మాన్‌ చేయడం లేదట. ఆయన బాలయ్య, తేజ సజ్జా మూవీస్‌లో నటించడం లేదని, అవన్నీ రూమర్స్ మాత్రమే అని ఆయన టీమ్ తెలియజేయడం విశేషం.

ఇదిలా ఉంటే తేజ సజ్జా `హనుమాన్‌` మూవీతో సంచలనం సృష్టించాడు. ఈ మూవీ మూడు వందల కోట్ల వసూళ్లని రాబట్టి రికార్డు క్రియేట్‌ చేసింది. దీంతో తేజ కెరీరే మారిపోయింది. ఆయనకు వరుసగా భారీ సినిమా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది. అలాగే దుల్కర్‌ సల్మాన్‌ ఇప్పుడు తెలుగు హీరో అయిపోయారు. ఆయన మలయాళం కంటే తెలుగులోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. `మహానటి`, `సీతారామం` చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు `లక్కీ భాస్కర్‌` అనే మూవీలో నటిస్తున్నాడు. `కల్కి2898ఏడీ`లో గెస్ట్ రోల్‌ చేస్తున్నారట.

Read more: చిరంజీవి, పవన్‌, రామ్‌చరణ్‌ మళ్లీ బాలీవుడ్‌పై దండయాత్ర.. ఈ సారైనా నెగ్గుతారా? తాడో పేడో తేల్చుకునే టైమ్‌?