ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ చిత్ర మ్యానియా సాగుతోంది. ఒక తెలుగు చిత్రాన్ని ఇంత ఘనంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళికి సినీ జనం నీరాజనాలు పడుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ చిత్ర మ్యానియా సాగుతోంది. ఒక తెలుగు చిత్రాన్ని ఇంత ఘనంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళికి సినీ జనం నీరాజనాలు పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన రాంచరణ్, ఎన్టీఆర్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఒక తెలుగు చిత్రం ఆస్కార్ అవార్డ్స్ బరిలో నిలవడంతో దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
మరో రోజులో ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్స్ లో ఉంది. దీనితో ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కాలని అభిమానులంతా ప్రార్థిస్తుండగా.. చిత్ర యూనిట్ యుఎస్ లోనే ఉంటూ భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాజమౌళి ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తాజాగా ప్రీ ఆస్కార్ పార్టీ నిర్వహించింది. ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన సౌత్ ఆసియా చిత్రాల ప్రముఖుల్ని ఈ పార్టీకి ఆహ్వానించారు. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. పలువురు బాలీవుడ్ తారలు కూడా ఈ ఈవెంట్ లో మెరిశారు.
సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా ఈ పార్టీలో సందడి చేస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో క్రేజీ సెల్ఫీకి ఫోజు ఇచ్చింది. ఈ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తో కూడా ప్రీతి జింతా సెల్ఫీకి ఫోజు ఇచ్చింది. అలాగే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ని కూడా ఈ ఫొటోస్ లో చూడొచ్చు.
ప్రీతి జింతా పోస్ట్ చేస్తూ.. ఆస్కార్ నామినేషన్స్ లో ఉన్నవారందరికి బిగ్ కంగ్రాట్స్. మీ అందరి కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా. సౌత్ ఏసియా సినిమా కమ్యూనిటీని ఒక్క చోట చేర్చిన ప్రియాంక చోప్రాకి థాంక్యూ అని పేర్కొంది. యుఎస్ లో ఆర్ఆర్ఆర్ ఫీవర్ మాములుగా వ్యాపించడం లేదు. అందరి నుంచి ఈ చిత్రానికి మద్దతు లభిస్తోంది.
ఆస్కార్ వేడుకకి ఇక ఒక్కరోజు మాత్రమే ఉంది. ఆర్ఆర్ఆర్ టీం, అకాడమీ అవార్డ్స్ ఈవెంట్ లో ఎలా సందడి చేస్తారు.. చరణ్, ఎన్టీఆర్ ఎలా కనిపిస్తారు.. నాటు నాటు సాంగ్ అవార్డు గెలిచిందా అనే ఉత్కంఠ ఎక్కువవుతోంది. ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్ అవార్డుతో తిరిగి రావాలని దేశవ్యాప్తంగా అభిమానులంతా కోరుకుంటున్నారు.
