సోషల్ మీడియాలో నెటిజన్లు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం చూస్తూనే ఉన్నాం. చాలా మంది హీరోయిన్లు తము ప్రెగ్నెంట్ గా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్ల ట్రోలింగ్ కి బలయ్యారు. హీరోయిన్ సమీరారెడ్డికి కూడా ఈ ట్రోలింగ్ తప్పలేదు.

రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్న ఆమె తరచూ తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. దీంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. ఓ రేంజ్ లో ఆమెని విమర్శించడంతో వారికి సమాధానం చెప్పాలనుకుంది.

ఈ క్రమంలో మరో బేబీ బంప్ ఫోటోని షేర్ చేసింది. బికినీ వేసుకొని తన బేబీ బంప్ కనిపించేలా బీచ్ ఒడ్డున ఫోటోలు దిగింది. వీటికి ''పుట్టేందుకు సిద్ధంగా ఉన్న నా బిడ్డ ఆత్మ ఎంతో బాధపడింది. నా కడుపులో స్విమ్ చేస్తోన్న బిడ్డ ఆత్మను గాయపరిచారు. నా ప్రెగ్నెన్సీ ని ఎంజాయ్ చేయడాన్ని ఎవరైతే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో.. వారందరికీ ఇదే నా సమాధానం'' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

నెటిజన్లు ఆమెని ఎంతగా ట్రోల్ చేస్తోన్నా.. సమీరా మాత్రం అసలు తగ్గడం లేదు. అంతకంతకూ వారికి బదులిస్తూనే ఉంది.