వృద్ధుడిపై పవన్ హీరోయిన్ కంప్లైంట్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 8, Sep 2018, 2:16 PM IST
preethi Jhangiani file complaint against senior citizen
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'తమ్ముడు' సినిమాలో నటించిన హీరోయిన్ ప్రీతి జింగ్యాని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'తమ్ముడు' సినిమాలో నటించిన హీరోయిన్ ప్రీతి జంగ్యాని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. తన భర్త ప్రవీణ్ దబాస్ తో కలిసి ముంబైలో జీవిస్తోంది. సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమె మీడియా కంట పడింది లేదు.

తాజాగా ఓ వృద్ధుడిపై ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచింది. అసలు విషయంలోకి వెళ్తే.. తన ఏడేళ్ల కొడుకు జయవీర్ ను ఓ సీనియర్ సిటిజన్ దూషించడంతో పాటు భయపెట్టారని ప్రీతి కంప్లైంట్ లో పేర్కొంది. జయవీర్ తన స్నేహితులతో కలిసి ఆదుకోవడానికి శివ స్థాన్ కి వెళ్లాడట. ఆడుకునే సమయంలో స్నేహితుల మధ్య చిన్న గొడవ జరగడంతో ఒక పిల్లాడు తన తాతయ్య ఆరిఫ్ సిద్ధిఖీకి విషయం చెప్పడంతో  ఆవేశంతో ఉన్న ఆయన జయవీర్ పై కోపాన్ని వెళ్లగక్కాడట.

అతడిని భయపెట్టడంతో పాటు సెక్యూరిటీని పిలిచి బిల్డింగ్ పై నుండి తోసేయమని చెప్పాడట. ఈ విషయంలో ఆయన కోపాన్ని కంట్రోల్ చేయడానికి కొందరు ప్రయత్నించినా ఆయన మాట వినలేదట. దీంతో అతడిపై కేసు నమోదు చేసింది ప్రీతి. అతడు క్షమాపణలు చెప్పే వరకు ఊరుకునేది లేదని పట్టుదలతో ఉన్నారట. పోలీసులు ఇరు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి పంపినట్లు సమాచారం.  

loader