ఇతిహాసాలతో కూడిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రేక్షకులకు కొత్త ఎక్సపీరియన్స్ ని ఇస్తోంది. చూసినవాళ్లే నాలుగైదు సార్లు చూస్తున్నారు.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’.. చిత్రం విడుదలై దాదాపు నెల కావొస్తున్నప్పటికి.. కలెక్షన్ల జోరు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ, పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఓవర్ సీస్ లో కూడా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక భారతీయుడు 2కి మిక్స్ డ్ టాక్ రావడంతో.. కల్కికి మరికొన్ని రోజులు ఎదురులేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఈ చిత్రం కలెక్షన్స్ డ్రాప్ అవకుండా ఆఫర్ ప్రకటించారు థియేటర్స్ వాళ్లు.
అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు . నార్త్ లో ఈ సినిమా లాంగ్ రన్ కోసం 5 వ వారం నుంచి ఈ సినిమా టిక్కెట్ ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అని ప్రకటించారు. దాదాపు అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలకు ఇది నార్త్ లో జరుగుతూ వస్తోంది. కొన్ని సినిమాలకు అయితే మొదటి లేదా రెండో వారానికే ఈ ఆఫర్ ఇస్తున్నారు. వచ్చే వారం నుంచి ఈ సినిమా క్రౌడ్ ని రెట్టింపు చేయటానికి హిందీ వెర్షన్ కు గానూ ఈ ఆఫర్ ని ప్రకటించినట్లు సమాచారం. సౌత్ లో కూడా ఇలాంటి ఆఫర్ ప్రకటిస్తే బాగుండను అని అంటున్నారు అభిమానులు.
ప్రముఖ దర్శకుడు నాగ్‌అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ జూన్ 27న రిలీజైన సంగతి తెలిసిందే. ఇతిహాసాలతో కూడిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రేక్షకులకు కొత్త ఎక్సపీరియన్స్ ని ఇస్తోంది. చూసినవాళ్లే నాలుగైదు సార్లు చూస్తున్నారు.. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ లాంటి ప్రముఖ నటుల కీలక పాత్రలు, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి యంగ్ హీరోల అతిథి పాత్రలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందునుంచీ భైరవగా సందడి చేసిన ప్రభాస్.. చివరిలో కర్ణుడిగా కనిపించి ‘పార్ట్ 2’పై అంచనాలు పెంచేశారు. ఈ సినిమా పిల్లలకు కూడా తెగ నచ్చుతోంది.
ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ విడుదలైన రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇటీవల రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. తాజాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ‘బుక్‌మైషో’లో అత్యధిక టికెట్లు బుక్ అయిన ఇండియన్ సినిమాగా నిలిచింది. 12.15 మిలియన్లకు పైగా ఈ మూవీ టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో, ఇప్పటివరకూ ఉన్న షారుక్ ఖాన్ ‘జవాన్’ (Jawan) రికార్డును (12.01 మిలియన్ టికెట్లు) ‘కల్కి’ అధిగమించినట్టైంది.
