'అ!' 'కల్కి' చిత్రాల తర్వాత ప్రశాంత్ వర్మ నుంచి వచ్చిన సినిమా కావడంతో జాంబి రెడ్డిపై పాజిటివ్ బజ్ బాగా క్రియేట్ అయింది.  మెగా హీరోలతో పాటు పలువురు సినీ ప్రముఖులు తేజ సజ్జ డెబ్యూ సినిమాకు అండగా నిలివటంతో సినిమా జనాల్లోకి బాగానే వెళ్లింది. దాంతో 'జాంబీరెడ్డి' చిత్రాన్ని గీతా డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసింది. ఫస్ట్ డే డివైడ్ టాక్ తెచ్చుకున్నా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి 'జాంబి రెడ్డి' సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.3.9 కోట్ల గ్రాస్ రాబట్టింది. నైజాంలో రూ.32 లక్షలు - సీడెడ్ లో రూ.19 లక్షలు రాబట్టింది. ఉత్తరాంధ్రలో 11 లక్షలు - తూర్పు గోదావరి జిల్లాలో 8 లక్షలు - పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.8 లక్షలు - గుంటూరులో 9 లక్షలు - కృష్ణా జిల్లాలో రూ. 8.1 లక్షలు - నెల్లూరు రూ.6 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. 

ఇక కర్ణాటక - ఇతర రాష్ట్రాలు కలుపుకొని రూ.6 లక్షలు.. ఓవర్సీస్ లో 2 లక్షలు రాబట్టింది. ఇదిలావుండగా 'జాంబీరెడ్డి' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు తెలుస్తోంది. ఇది సుమారు రూ.4 కోట్ల నుంచి రూ.4.5 కోట్ల మధ్య జరిగిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
 
ఇక ఈ సినిమా ఫస్టాఫ్ సోసోగా ఉన్నా సెకండాఫ్ భలే ఫన్నీగా ఉంది. ఖచ్చితంగా సినిమా చూస్తూ నవ్వుకుంటారు.  గెట‌ప్ శ్రీను, పృథ్వీ, అన్నపూర్ణమ్మ‌, హేమంత్ ..జాంబీలతో కలిసి తెగ  న‌వ్వించారు. జాంబీలను తీసుకొచ్చి మన తెలుగు ఫ్యాక్షన్ నేపధ్యంలో పెట్టి దానికి మన నేటివిటి అద్దటంతోనే సగం సక్సెస్ అయ్యారు. అలాగే జాంబీలనగానే హారర్ స్క్రీమ్ పెట్టుకోకుండా ఫన్ గా వెళ్లటం మరింత కలిసొచ్చింది.