Salaar మొత్తానికి రిలీజ్ అయ్యింది.. మరీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ Prashanth Neel  ప్లాన్ ఏంటీ.. ప్రభాస్ తో సలార్ 2నా, లేదంటే ఎన్టీఆర్ తో NTR31నా అనేది సందేహంగా మారింది. ఈ క్రమంలో నీల్ నుంచి క్లారిటీ అందింది.

సలార్ సీజ్ ఫైర్ (Salaar Cease Fire) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రభాస్ Prabhas ను కొన్నేళ్ల నుంచి ఎలా చూడాలని అభిమానులు ఊహించుకున్నారో అదే రేంజ్ లో ప్రశాంత్ నీల్ Prashanth Neel చూపించారు. దీంతో అభిమానులు థియేటర్ల వద్ద ఫుల్ హంగామా చేస్తున్నారు. రెబల్ స్టార్ ఉగ్రరూపాన్ని వెండితెరపై చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. Salaar యాక్షన్ సీన్లు, డైలాగ్స్, కథ, స్నేహబంధం గురించి చక్కగా వివరించారు. 

మొత్తానికి సలార్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. ఇక ప్రశాంత్ నీల్ నెక్ట్స్ ప్లాన్ ఎంటనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు సలార్ 2 Salaar 2 శౌర్యంగ పర్వం, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ NTR తో ఎప్పుడో ప్రకటించిన NTR31 ఉండటం విశేషం. దీంతో ప్రశాంత్ నీల్ ఏ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్, ఎన్టీఆర్ అభిమానుల మొదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇదే కావడం విశేషం. 

అయితే, నిన్నటి ప్రశాంత్ నీల్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను కూడా ప్రభాస్ తోనే.. అంటే Salaar 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని ప్రచారం జరిగింది. ఇప్పటికే పార్ట్ కు సంబంధించిన షూట్ కూడా కొంత భాగం పూర్తైందని.. అటు ఎన్టీఆర్ సైతం ‘దేవర’ Devara, War2 చిత్రాలతో బిజీగా ఉండటంతో ‘సలార్ 2’నే షూట్ చేస్తారని టాక్ వచ్చింది. 

ఇక తాజాగా మాత్రం ఎన్టీఆర్31పైనే ఫోకస్ పెట్టినట్టు ప్రశాంత్ నీల్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఆయనే స్వయం చెప్పినట్టు సినీ వర్గాల్లో వార్త ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది మేలో పూజా కార్యక్రమంతో పాటు ఆగస్టు నుంచి రెగ్యూలర్ షూట్ ను ప్లాన్ చేస్తున్నారంట. ఇక ఈ చిత్రం 2025లోనే రాబోతుందని తెలుస్తోంది. ఈ అప్డేట్ తో తారక్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. దీనిపైనా మున్ముందు ఇంకా స్పష్టత రానుంది.