సాధారణంగా ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ ...సీనియర్స్ ప్రక్కన చేయటానికి ఉత్సాహం చూపించరు. తమ కెరీర్ ముందుకు వెళ్లదని, వాళ్లు యంగ్ హీరోల సరసన చేయటానికే ఆసక్తి చూపెడుతూంటారు. సమంత అక్కినేనిది కూడా అదే పరిస్దితి. ఆమె స్టార్ హీరోయిన్ గా ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలుతోంది. ఈ నేపధ్యంలో ఆమె కేవలం స్టార్స్ ప్రక్కనే చెయ్యాలి లెక్క ప్రకారం. కానీ సమంత..తనకు కథే ప్రాధాన్యత అని, మిగతావన్ని దాని తర్వాతే అని సినిమాలు చేస్తోంది. అలాంటి ఆలోచనతోటే మొన్నామధ్య ఓ బేబీ సినిమా చేస్తే రీసెంట్ గా జాను సినిమా చేసింది. జాను సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దాంతో సమంత కాస్త డల్ అయ్యిన మాట వాస్తవం.  ఈ నేపధ్యంలో ఆమె ఓ కొత్త చిత్రం ఒప్పుకుంది. అందులో సీనియర్ హీరో ప్రశాంత్ (జీన్స్ ఫేమ్) సరసన నటించబోతోంది. ఈ మేరకు ఆమె సైన్ చేసినట్లు సమాచారం. 

ఇక ‘జాను’ ఆశించిన ఫలితం సాధించకపోయినా నటిగా సమంతకు మంచి మార్కులు పడ్డాయి.  ‘యు టర్న్‌’, ‘ఓ బేబీ’ చిత్రాలు...  లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ని ఒంటి చేత్తో  నడిపించగలిగే సత్తా సమంతకు ఉందని ప్రూవ్‌  చేసాయి. ఈ నేపధ్యంలో సమంత ఓ సినిమాకి సైన్‌ చేసింది. ‘గేమ్‌ ఓవర్‌’ దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ చెప్పిన కథ నచ్చి, ఆమె ఈ సినిమా అంగీకరించారట. ఈ చిత్ర కథ సమంత చుట్టూ తిరుగుతుందని టాక్‌. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో ‘జీన్స్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నటించనున్నారు. 

 ఇప్పుడు అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో అంగీకరించిన సినిమా కూడా హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమానే అని సినీ వర్గాల సమాచాం. ఇప్పటివరకూ సమంత రెండు ద్విభాషా చిత్రాల్లో చేశారు. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ ఇటు తెలుగు అటు తమిళంలో ఒకేసారి రూపొందింది. అలాగే 2018లో వచ్చిన ‘యు టర్న్‌’ తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ముచ్చటగా మూడోసారి ద్విభాషా చిత్రం చేయనున్నారామె. వచ్చే నెల ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారట.