`కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ నెక్ట్స్ ప్రాజెక్ట్ టాలీవుడ్‌ హీరోలతోనే అని బలంగా వార్తలొస్తున్నాయి. ఇటీవల ఆయన ప్రభాస్‌కి, ఎన్టీఆర్‌కి కథలు చెప్పాడని, అందులో దాదాపు రెండూ ఓకే అయ్యాయని అన్నారు. ఈ ఇద్దరు సూపర్‌ స్టార్స్ లో మొదట ఎవరితో ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఉంటుందన్నది సస్పెన్స్ గా మారింది. ఆ క్యాలుకులేషన్‌ చేసుకునే టైమ్‌లోనే ప్రభాస్‌ తన మూడో సినిమాని, అంటే తాను నటించబోతున్న 22వ చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు. 

బాలీవుడ్‌ దర్శకుడు ఓ రౌత్‌ తో ఓ పౌరాణిక సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇది హిందీలో పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందబోతుంది. దీన్ని టీ సిరీస్‌ నిర్మించబోతుంది. ఇందులో ప్రభాస్‌ రాముడిగా, కీర్తిసురేష్‌ సీతగా కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. 

అదే సమయంలో ప్రభాస్‌ ఓ క్లారిటీ ఇచ్చాడు. `కేజీఎఫ్‌` డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో తన సినిమా ఇప్పట్లో ఉండదని స్పష్టం చేశాడు. ప్రభాస్‌ ప్రస్తుతం ఉన్న మూడు ప్రాజెక్ట్ లు పూర్తి కావడానికి ఇంకోరెండేళ్ళు పడుతుంది. అంటే 2022 వరకు ఆయన ఈ సినిమాలతోనే బిజీగా ఉంటాడు. దీంతో ప్రశాంత్‌ నీల్‌తో ఆయన సినిమా డౌటే అని చెప్పొచ్చు. 

ఇక ప్రశాంత్‌నీల్‌కి ఉన్న ఒకే ఒక ఆప్షన్‌ ఎన్టీఆర్‌. ఎలాగూ వీరి మధ్య కథా చర్చలు జరిగాయి. దాదాపు కథపరంగా ఎన్టీఆర్‌ ఓకే చెప్పాడని టాక్. దీంతో ప్రశాంత్‌ తదుపరి సినిమా ఎన్టీఆర్‌తోనే ఉంటుందని తెలుస్తుంది. ఎన్టీఆర్‌ ప్రస్తుతం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో నటిస్తున్నారు. ఇది భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. దీంతోపాటు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్‌ అయ్యాడు. ఇది వచ్చే ఏడాది మిడిల్‌ వరకు కంప్లీట్‌ అవుతుంది. ఆ లోపు ప్రశాంత్‌ నీల్‌ `కేజీఎఫ్‌ 2`ని పూర్తి చేసుకుని ఎన్టీఆర్‌తో కథని బౌండెడ్‌ స్క్రిప్ట్ గా మార్చుకుని వస్తాడని తెలుస్తుంది. మరి ఇలానే జరుగుతుందా? ఈ లోపు ఇంకా ఎన్నెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో? చూడాలి.