ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి కారణంగా వణికిపోతోంది. దాదాపు ప్రపంచమంతా స్థంబించిపోయింది. అయితే క్రియేటివ్‌ పీపుల్ మాత్రం కరోనా కాలాన్ని కూడా చాలా బాగా వాడేస్తున్నారు. పలువురు దర్శకులు తమ సినిమాలకు కథా వస్తువులుగా కరోనా వైరస్‌నే ఎంచుకుంటున్నారు. ఇప్పటికే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్‌ పేరుతో  ఓ సినిమాను రూపొందించి ట్రైలర్‌ కూడా రిలీజ్ చేశాడు.

తాజాగా మరో దర్శకుడు కూడా కరోనాను నేపథ్యంలో ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు. అ! సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ ఆ సినిమాతో కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయినా.. డైరెక్టర్‌గా మంచి పేరుతెచ్చుకున్నాడు. తరువాత కల్కి సినిమాతో మరోసారి ఆకట్టుకున్న ఈ యంగ్ డైరెక్టర్ మూడో సినిమా కూడా ఓ డిఫరెంట్‌ స్టోరిని ఎంచుకున్నాడు. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు ప్రశాంత్ వర్మ.
Can't wait for Awe 2 proclaim Kajal Aggarwal fans as Prasanth ...

ప్రశాంత్ వర్మ మూడో ప్రయత్నంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. అంతేకాదు కాన్సెప్ట్ పోస్టర్‌లోనే కరోనా ప్రారంభం మాత్రమే అంటే సినిమా కథా కథనాల్లో మరింత విధ్వంసం చూపించబోతున్నట్టుగా హింట్ ఇచ్చాడు. తన ప్రతీ సినిమా కన్సెప్ట్ పోస్టర్‌లోనే క్లైమాక్స్‌ ట్విస్ట్‌కు సంబంధించి హింట్ ఇవ్వటం ప్రశాంత్ వర్మకు అలవాటు ఈ సినిమాలో కూడా ఓ క్రూర జంతువే విధ్వంసానికి కారణంగా అన్నట్టుగా చూపించాడు దర్శకుడు. అసలు విషయం ఏంటో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.