టాలీవుడ్ బాపు బొమ్మ ప్రణీత సుభాష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.  ప్రణీత మొహానికి సూదులు గుచ్చి ఉన్నాయి.  ఇది అక్యుపంక్చర్ వైద్య విధానంలో ఒక పద్దతి. శరీరంలోని రకరకాల సమస్యలను, నొప్పులను సూదులు గుచ్చి నయం చేస్తారు. ఇది చైనాలోని పురాతన వైద్య విధానం. ఇదే విషయాన్ని ప్రణీత చెబుతూ అక్యుపంక్చర్ చేసుకున్నాని తెలిపింది. ఇందులో ప్రణీత మొహం మీద సన్నటి సూదులు గుచ్చి ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.మీరు ఇక్కడ ఆ ఫొటోని చూడవచ్చు.

కన్నడ భామ, అత్తారింటికి దారేదీ హీరోయిన్‌ ప్రణీత మిగతా హీరోయిన్స్ అందరికీ కాస్తంత భిన్నం. సాయం అంటే చాలు స్వయంగా కార్యక్షేత్రంలోకి దిగుతుంది. చేతులారా సాయం చేస్తుంది. కరోనా టైమ్ లోనూ అంతే. వంటింట్లోకి దూరి గరిటె తిప్పింది. అన్నాన్ని ప్యాక్‌ చేసింది. ఆకలితో ఉన్నవారికి అందేదాకా దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేసింది. లాక్‌డౌన్‌వేళ.. మనసున్న మనిషిగా ఎందరినో ఆదుకుంది ప్రణీత. 

‘ఈ సమయంలో దినసరి కూలీలు, ఆటో డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, సినిమా అసిస్టెంట్లు, లైట్‌బాయ్‌లు, తోపుడు బండ్ల వ్యాపారులకు పని లేదు. చేతిలో డబ్బుల్లేవు. తిండి కరవైంది. అలాంటివాళ్ల ఆకలి తీర్చడానికి మా ప్రణీత ఫౌండేషన్‌ ప్రయత్నిస్తోంది’ అంటోందామె. లాక్‌డౌన్‌ మొదలవగానే అందరికన్నా ముందే తనవంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చింది. అంతటితో ఊరుకోలేదు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా బాధితుల్ని ఎంపిక చేసి, రూ.పదిలక్షల విరాళాలు సేకరించి నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లో వేయించింది. ఆపన్నులకు నిరాటంకంగా ఆహారం అందించింది.