ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ లక్ష్మీస్ ఎన్టీఆర్ కి దర్శకత్వం వహిస్తున్న ఆర్జీవీ ఎన్టీఆర్ గా ప్రకాశ్ రాజ్ నటిస్తారంటూ టాక్

లెజెండరీ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు.. చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు వర్మ మంగళవారం ప్రకటించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరవాత జరిగిన పరిణామాలపై మాత్రమే ఈ సినిమా ఉంటుందని వర్మ స్పష్టం చేశారు.



ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఆఖరి రోజుల్లో ఏం జరిగిందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారు..? అని ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రకాష్ రాజ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రకాష్ రాజ్ అనే సరికి ఆ సినిమాకు కచ్చితంగా హైప్ క్రియేట్ అవుతుంది. తన నటనతో ఎన్టీఆర్ పాత్రకు పూర్తి న్యాయం చేయగలరు ప్రకాష్ రాజ్. కానీ అభిమానులు మాత్రం ప్రకాష్ రాజ్‌ను ఎన్టీఆర్ పాత్రలో ఊహించుకోలేరనే వాదనలు కూడా వినపడుతున్నాయి.


ఇప్పటికే వర్మ.. ప్రకాశ్ రాజ్ ని సంప్రదించినట్లు సమాచారం. ఒకవేళ ప్రకాశ్ రాజ్ అంగీకరించకపోతే.. బాలీవుడ్ నటులతో సినిమా తీయాలని వర్మ భావిస్తున్నారని సమాచారం.