నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాజకీయాల పరంగా ఎప్పటికప్పుడు నాయకులను ప్రశ్నిస్తూనే ఉంటాడు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన బీజెపీ పార్టీపై చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

తెలంగాణా రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంటే.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో బీజేపీకి ఓటర్లు షాక్ ఇస్తున్నారు. ఆ 
రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి దిశగా ప్రయాణిస్తుంది.

దీంతో ఈ విషయంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'ఇది దేశపౌరుల మన్ కీ బాత్.. వరుస ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు బై బై చెబుతున్నారు. మీ అందరికీ ఓటమికి గల కారణాలు ఏంటో తెలుసా..? లేకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటారు' అంటూ ట్వీట్ చేస్తూ 'జస్ట్ ఆస్కింగ్' అనే హ్యాష్ ట్యాగ్ ని జత చేశారు.