ఈ ఎన్నికల్లో సినీ తారలు కొంతమంది దారుణమైన రిజల్ట్ ను అందుకున్న విషయం తెలిసిందే. కొందరు బారి మెజారిటీతో విజయాన్ని అందుకుంటే మరికొందరు కనీసం సరైన పోటీని కూడా ఇవ్వలేకపోయారు. అందులో ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. 

బెంగుళూరు సెంట్రల్ లోక్ సభ ఫైట్ లో నిలబడిన ఈ సీనియర్ యాక్టర్ మూడవ స్థానంలో 2.4% మాత్రం ఓట్లనే అందుకున్నారు. ఆ స్థానంలో బీజేపీ నాయకుడు పిసి.మోహన్ 50.4% ఓట్లను అందుకొని భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ దెబ్బతో ప్రకాష్ రాజ్ మళ్ళీ రాజకీయాల వైపు చూడరని వస్తోన్న వార్తలపై ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చే విధంగా మాట్లాడారు. 

రాజకీయాల్లో ఉంటానని చెబుతూ.. పార్టీ కూడా స్థాపిస్తానని అన్నారు. ఇండిపెండెట్ అభ్యర్థిగా ఉన్నందున జనాలకు తనకు మధ్య గ్యాప్ పెరిగిందని నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు పార్టీటీని స్థాపించి జనాల ముందుకు వెళతామని అన్నారు. ఇక రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాల్లో కూడా నటిస్తానని చెప్పిన ప్రకాష్ రాజ్ పార్టీని నడపాలంటే డబ్బులు అవసరం కావున సినిమాలు చేయాల్సిందే అని వివరణ ఇచ్చారు.