సోషల్ మీడియాలో దర్శకేంద్రుని మూవీ స్టిల్ హల్ చల్ సోషల్ ఎకౌంంట్ లో ఓం నమో వెంకటేశాయ ఫస్ట్ లుక్ తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ప్రగ్యా జైస్వాల్
రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ఓం నమో వేంకటేశాయ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రగ్యా జైస్వాల్ ఫస్ట్ లుక్ మోషన్ పిక్చర్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తుండగా, తాజాగా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రగ్యా జైస్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నాగ్‑కు జోడిగా నటిస్తున్న ప్రగ్యా ఇన్ స్టా గ్రామ్ లో తన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను అప్ లోడ్ చేసి మెస్మరైజ్ చేసింది.
అయితే ఈ ఫస్ట్ లుక్ లో మరో విశేషం కూడా ఉంది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న లెహంగాలో కనిపించిన ప్రగ్యా, తన కాస్ట్యూమ్స్ కు సంబంధించి సమాచారం కూడా ఇచ్చింది. తన ట్యాగ్స్ లో 14 కేజీల బంగారు లెహంగా అనే ట్యాగ్ ఇచ్చింది. దీంతో పోస్టర్లో ప్రగ్యా వేసుకున్న బంగారు వర్ణ లెహంగా 14 కేజీల బంగారంతో బరువు ఉంటుందని తెలుస్తోంది. లోకేషన్, ప్రగ్యా కాస్ట్యూమ్స్, లుక్స్ చూస్తుంటే ఇది దర్శకేంద్రుడి మార్క్ సాంగ్ లొకేషన్ అయి ఉంటుందనిపిస్తుంది.
